తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ పై రేవంత్ సీరియస్- రీజన్ ఇదే..!

తెలంగాణ ముఖమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇవాళ కొత్త డీజీపీ సీవీ ఆనంద్ (CV Anand) పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కాన్వాయ్ కోసం హైదరాబాద్ నగరంలో వాహనాలను రోడ్లపై వాహనాలను గంటల తరబడి ఆపడంపై సీరియస్ అయ్యారు. ఈ విషయంలో అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. దీంతో వెంటనే వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి సీవీ ఆనంద్.. సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఈ వ్యవహారం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది.

తల్లి కోరిక నెరవేర్చిన తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్-ఎమోషనల్ ట్వీట్..!
తల్లి కోరిక నెరవేర్చిన తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్-ఎమోషనల్ ట్వీట్..!

ఇవాళ ఢిల్లీ వెళ్లేందుకు బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డికి శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో భారీగా వాహనాలు నిలిచిపోయి ఉండటం చికాకు కలిగించింది. దీంతో డీజీపీ సీవీ ఆనంద్ కు ఫోన్ చేసిన ఆయన.. తన పర్యటనల సమయంలో సామాన్య ప్రజల్ని గంటల తరబడి రోడ్లపై నిలబెట్టవద్దని, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. తన కాన్వాయ్ కోసం సామాన్య ప్రజల పనులకు ఆటంకం కలిగించవద్దని కోరారు.

Revanth Reddy Angry at DGP CV Anand No Traffic Halts for My Convoy Says Telangana CM
తెలంగాణ ఉద్యోగులకు రేవంత్ గుడ్ న్యూస్..! కీలక నిర్ణయాలు..!
తెలంగాణ ఉద్యోగులకు రేవంత్ గుడ్ న్యూస్..! కీలక నిర్ణయాలు..!

తన కాన్వాయ్ వెళ్లే దారితో పాటు ఎదురుగా ఉన్న రోడ్డుపై కూడా వాహనాలను పోలీసులు నిలిపేయడంపై రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ ను ఇష్టారాజ్యంగా ఆపేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆయన ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో వెంటనే రాష్ట్రంలోని పోలీసు కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన డీజీపీ ఆనంద్.. వారికి దిశానిర్దేశం చేశారు. అంతే కాదు రాష్ట్రంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం ప్రత్యేక బ్యూరోను ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+