హైదరాబాద్, నర్సాపూర్ నుంచి అరుణాచలానికి ప్రత్యేక రైళ్లు పొడిగింపు: హాల్ట్ స్టేషన్లు

ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. గతంలో ప్రకటించిన ప్రత్యేక రైళ్లను పొడిగిస్తూ వస్తోన్నారు. ఏపీ, తెలంగాణల నుంచి రాకపోకలు సాగించే రైళ్లు ఇవి. నర్సాపూర్, హైదరాబాద్, చర్లపల్లి, తిరుపతి వంటి స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక సర్వీసులు వివిధ ప్రధాన గమ్యస్థానాల మధ్య అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వీటిల్లో మెజారిటీ రైలు సర్వీసులను పొడిగించారు. ప్రయాణికుల నుండి అపూర్వ ఆదరణ అందుతున్న నేపథ్యంలో తాజా చర్యలు తీసుకున్నారు.

నరసాపూర్- తిరువణ్ణామలై, హైదరాబాద్- కొల్లం, చర్లపల్లి- తిరుచిరాపల్లి మధ్య రాకపోకలు సాగించే ప్రత్యేక రైళ్లను మరో నెల రోజుల పాటు అంటే జూన్ చివరి వారం వరకూ పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

South Central Railway Extends Special Weekly Trains From Hyderabad Travel Relief Across Destinations

నరసాపూర్- తిరువణ్ణామలై..

జూన్ 3వ తేదీ నుంచి అదే నెల 26వ తేదీ వరకు ప్రతి బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు నర్సాపూర్ నుండి బయలుదేరే నంబర్ 07219 ప్రత్యేక రైలు మరుసటి రోజు తెల్లవారు జామున 4:55 నిమిషాలకు తిరువణ్ణామలైకు చేరుకుంటుంది.

జూన్ 4వ తేదీ నుంచి అదే నెల 25వ తేదీ వరకు ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు తిరువణ్ణామలై నుండి బయలుదేరే నంబర్ 07220 ప్రత్యేక రైలు మరుసటి రోజు వేకువ జామున 2 గంటలకు నర్సాపూర్ కు చేరుకుంటుంది.

పాలకొల్లు, వీరవాసరం, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కాట్పాడి, వేలూరు, వెలూరు కంటోన్మెంట్ మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.

హైదరాబాద్- కొల్లం..

ఈ నెల 30 నుంచి జూన్ జూన్ 27 వరకు ప్రతి శనివారం రాత్రి 11:10 నిమిషాలకు బయలుదేరే నంబర్ 07193 ప్రత్యేక రైలు రెండో రోజు ఉదయం 7:10 నిమిషాలకు కొల్లం చేరుకుంటుంది.

జూన్ 1 నుండి 29 వరకు ప్రతి సోమవారం ఉదయం 10:45 నిమిషాలకు కొల్లం నుంచి బయలుదేరే నంబర్ 07194 ప్రత్యేక రైలు మరుసటి రోజు సాయంత్రం 5:30 గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటుంది.

సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జోలార్ పేట, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొదనూర్, పాలక్కాడ్, త్రిశూర్, ఆలువ, ఎర్నాకుళం, కొట్టాయం, చంగనస్సేరి, తిరువళ్ల, చెంగన్నూర్, మావెళ్లిక్కార, కాయంకుళం, కరునాగపల్లి, సస్థాన్ కోట మీదుగా రాకపోకలు సాగిస్తుంది.

చర్లపల్లి- తిరుచిరాపల్లి..

జూన్ 9 నుండి అదే నెల 30 వరకు ప్రతి మంగళవారం సాయంత్రం 5:50 నిమిషాలకు చర్లపల్లి నుంచి బయలుదేరే నంబర్ 07615 ప్రత్యేక రైలు మరుసటి రోజు సాయంత్రం 6:45 నిమిషాలకు తిరుచిరాపల్లికి చేరుకుంటుంది.

జూన్ 10 నుండి జూలై 1 వరకు ప్రతి బుధవారం రాత్రి 9:30 గంటలకు తిరుచిరాపల్లి నుంచి బయలుదేరే నంబర్ 07616 ప్రత్యేక రైలు మరుసటి రోజు రాత్రి 9:30 నిమిషాలకు చర్లపల్లికి చేరుకుంటుంది.

నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కాట్పాడి, వేలూరు కంటోన్మెంట్, తిరువణ్ణామలై, తిరుక్కోవిళూర్, విల్లుపురం, విరుధాచలం, అరియలూరు, శ్రీరంగం మీదుగా రాకపోకలు సాగిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+