7 సెకన్లలో గుండె పరీక్ష.. ఏఐతో అదరగొట్టిన 14 ఏళ్ల కుర్రాడు!
Artificial intelligence: కొందరు చిన్నతనంలోనే తమ అద్భుత ప్రతిభతో జనాలను ఆశ్చర్యపరుస్తుంటారు. అలాంటివారిలో 14 ఏళ్ల ఎన్నారై విద్యార్థి సిద్ధార్థ్ నంద్యాల కూడా ఉన్నాడు. సిద్ధార్థ్ నంద్యాల వయస్సు 14 ఏళ్లే అయినప్పటికీ.. ఆలోచన మాత్రం చాలా పెద్దది. వినూత్న ఆవిష్కరణలపై దృష్టి సారించిన సిద్ధార్థ్ 7 సెకన్లలోనే గుండె జబ్బులు నిర్ధారించేలా ఏఐ సాయంతో సర్కాడియన్ అనే యాప్‌ను రూపొందించాడు.
యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో విద్యార్థి అయిన సిద్ధార్థ్ నంద్యాల ఏఐ సహాయంతో ఆరోగ్య రంగాన్ని విప్లవాత్మకంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. టెక్సాస్‌కు చెందిన 14 ఏళ్ల బాలుడు 7 సెకన్లలోనే గుండె జబ్బులను గుర్తించగల యాప్‌ను కనిపెట్టి వైద్య ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఫ్రిస్కోకుకు చెందిన సిద్ధార్థ్ నంద్యాల సర్కాడియన్ ఏఐ అనే స్మార్ట్‌ఫోన్ యాప్‌ను అభివృద్ధి చేశాడు. ఇది గుండె జబ్బుల ప్రారంభ లక్షణాలను ఖచ్చితత్వంతో గుర్తించగలదు. స్మార్ట్‌ఫోన్‌ను ఛాతీకి దగ్గరగా ఉంచడం ద్వారా, యాప్ హృదయ స్పందనను రికార్డ్ చేస్తుంది. నేపథ్య శబ్దాన్ని తొలగిస్తుంది. డేటాను విశ్లేషించడానికి క్లౌడ్ ఆధారిత మెషిన్ లెర్నింగ్ మోడల్‌ను ఉపయోగిస్తుంది. ఇది అరిథ్మియా, గుండె వైఫల్యం, కరోనరీ ఆర్టరీ డిసీజ్, వాల్వ్ సమస్యల వంటి పరిస్థితులను గుర్తించగలదు.

సిద్ధార్థ్ నంద్యాల అమెరికా, భారత్‌లోని ఆస్పత్రుల నుంచి డేటాను సేకరించి వైద్య నిపుణులతో కలిసి యాప్ ను మెరుగుపరిచాడు. 15 వేల మంది అమెరికన్, 3,500 మంది భారతీయ రోగులతో కూడిన క్రినికల్ ట్రయల్స్ యాప్ 96 శాతం కంటే ఎక్కువగా ఖచ్చితత్వాన్ని ప్రదర్శించాయి. ప్రస్తుతం ఈ యాప్ శిక్షణ పొందిన వైద్య సిబ్బంది మాత్రమే ఉపయోగించేందుకు ఉద్దేశించబడింది. ఈసీజీ వంటి సాంప్రదాయ పద్ధతులకు ప్రత్యామ్నాయంగా కాకుండా ప్రీ-స్కానింగ్ సాధనంగా పనిచేస్తుంది.
కార్డియాలజిస్టులు సిద్ధార్థ్ ఆవిష్కరణను ప్రశంసించారు. ముఖ్యంగా పరిమిత ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు ఉన్న ప్రాంతాలలో దాని సామర్థ్యాన్ని గుర్తించారు. ఈ ఆవిష్కరణ ఒక కీలకమైన అవసరాన్ని తీరుస్తుంది. ఎందుకంటే గుండె జబ్బులు ప్రపంచ మరణాలలో సుమారు 32 శాతం వాటాను కలిగి ఉన్నాయి. లూసియానా స్టేట్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ జమీలా అహ్మద్ ప్రకారం.. "వైద్య సేవలను పొందలేని రోగులలో ముందస్తు వ్యాధి నిర్ధారణ వారి ప్రాణాలను కాపాడుతుంది." అని పేర్కొన్నారు. ఇది సిద్ధార్థ్ నంద్యాల రూపొందించిన యాప్ గొప్పదనాన్ని గురించి తెలియజేస్తుంది. సిద్ధార్థ్ నంద్యాల తన యాప్ సామర్థ్యాలను న్యుమోనియా, పల్మనరీ ఎంబోలిజం వంటి ఊపిరితిత్తుల వ్యాధులను గుర్తించడానికి విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. "నేను ప్రపంచాన్ని మెరుగుపరిచే మార్పును తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఆవిష్కర్తలు తమ కంఫర్ట్ జోన్ నుండి బయటపడి గొప్పగా ఏదైనా చేయగలరు" అని సిద్ధార్థ్ నంద్యాల చెప్పాడు.
సిద్ధార్థ్ నంద్యాల ఆవిష్కరణలలో ఇదే మొదటి కాదు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో కంప్యూటర్ సైన్స్ విద్యార్థి అయిన సిద్ధార్థ్ గతంలో తక్కువ ధర గల ప్రొస్థెటిక్ ఆర్మ్‌ను సృష్టించాడు. విద్యార్థుల కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ కిట్లను అందించే 'STEM IT' అనే స్టార్టప్‌ను స్థాపించాడు. సిద్ధార్థ్ సహకారాలకు యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ నుంచి గుర్తింపు పత్రం, అప్పటి అధ్యక్షుడు జో బైడెన్ నుంచి అభినందన లేఖతో సహా గణనీయమైన గుర్తింపు లభించింది.
ఆ యాప్ సాయంతో గుంటూరులో పరీక్షలు
సిద్ధార్థ్ రూపొందించి యాప్ సాయంతో ఇటీవల గుంటూరు సర్వజనాసుపత్రిలో రోగులకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. అయితే తాజాగా సిద్దార్థ్ నంద్యాల... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను కలిశారు. ఈ సందర్భంగా సిద్ధార్థ్ ను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందించారు. ఈ సందర్భంగా ఇలాంటి మరిన్ని ఆవిష్కరణలు చేయాలని సిద్ధార్థ్‌ను చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రోత్సహించారు.
సిద్ధార్థ్ నంద్యాల ఎవరు?
సిద్ధార్థ్ నంద్యాల కుటుంబం ఏపీలోని అనంతపురానికి చెందినవారు. అయితే 2010లో వారి కుటుంబం అమెరికాకు వెళ్లింది. ప్రస్తుతం సిద్ధార్థ్ నంద్యాల కుటుంబం టెక్సాస్‌లోని ఫ్రిస్కోలో స్థిరపడ్డారు. సిద్ధార్థ్ నంద్యాల ఒక టెక్ వ్యవస్థాపకుడిగా ఉండటమే కాకుండా... STEM-IT TECH వ్యవస్థాపకుడిగా, సీఈవోగాఉన్నారు.
-
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు












Click it and Unblock the Notifications