Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేంద్ర బడ్జెట్ లో వీటి హవా

కేంద్ర వార్షిక బడ్జెట్‌లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ హవా సైతం కనిపించింది. సర్వీస్ సెక్టార్ లో ఉద్యోగ- ఉపాధి అవకాశాలపై ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఆటోమేషన్.. వంటి సాంకేతికత ప్రభావాన్ని అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయిలో ఓ స్టాండింగ్ కమిటీని ప్రకటించింది. ఈ కమిటీ- ఉద్యోగ, ఉపాధి, కార్మిక, ఐటీ.. రంగాల్లో భవిష్యత్ మార్కెట్ ఎలా ఉంటుందనేది అధ్యయనం చేస్తుంది. దీనివల్ల ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడానికి అవసరమైన సిఫారసులను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తుంది.

ఈ ప్యానెల్ ఐటీ, ఆర్థిక, పర్యాటక, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాలలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, డిజిటల్ ట్రాన్స్ ఫార్మేషన్ ఉద్యోగ- ఉపాధి రంగాలపై మున్ముందు ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయనేది విశ్లేషిస్తుంది. 2047 నాటికి ఏఐ, దాని అనుబంధ సాంకేతికతను ప్రపంచ స్థాయిలో సర్వీసుల సెక్టార్ లో మార్కెట్‌లో 10 శాతం వాటా సాధించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. సూపర్ పవర్ గా ఎదగాలని నిర్ణయించుకుంది. వికసిత్ భారత్ విజన్‌కు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి, విధాన సిఫార్సులు కమిటీ చేస్తుంది.

AI automation and digital transformation reshaping services jobs under Viksit Bharat in Budget 2026

అత్యాధునిక సాంకేతికత, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, మెషిన్ లెర్నింగ్ వంటివి ఆర్థిక వృద్ధికి శక్తివంతమైన డ్రైవింగ్ ఫోర్సెస్ గా మారుబోతున్నాయని, ఇది తథ్యమని నిర్మల సీతారామన్ వ్యాఖ్యానించారు. వ్యవసాయ ఉత్పాదకత, క్షేత్ర స్థాయిలో వాటి సామర్థ్యం పెంచడానికి AI-ఆధారిత టూల్స్ ను వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అందుకే ఈ వార్షిక బడ్జెట్ లో హైపవర్డ్ ప్యానెట్ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు వివరించారు.

ఉపాధి కల్పనలో టెక్నాలజీ వినియోగానికి, ఇతర కీలక రంగాలను గుర్తించడానికి జాతీయ డిజిటల్ నాలెడ్జ్ గ్రిడ్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నిర్మల సీతారామన్ పేర్కొన్నారు. ఆగస్టు 15 నుండి 350కి పైగా సంస్కరణలు అమలైనట్లు తెలిపారు. నిర్మాణాత్మక సంస్కరణల కొనసాగింపు అవసరాన్నిపునరుద్ఘాటించారు. సంస్కరణల ఎక్స్‌ప్రెస్ విజయవంతంగా సాగుతోందని, దీనికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతికతను జోడించాల్సిన అవసరం ఉందని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+