ఈ AI వల్ల ఇంకా ఏమేం చూడాలో..?

ఇప్పుడు టెక్ ప్రపంచం మొత్తం కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చుట్టే తిరుగుతోంది. చివరికి- ఆటోమోటివ్ సెగ్మెంట్ లో సైతం ఏఐ దూసుకొచ్చేసింది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అందుబాటులోకి రావడమే దీనికి నిదర్శనం. ఊహకు కూడా అందని విధంగా డ్రైవరే అక్కర్లేని కార్లు రోడ్ల మీదికి వచ్చేస్తోన్నాయి. ఏఐ.. డ్రైవర్ రోల్ ను పోషిస్తోంది.

మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఆధారంగా పనిచేసే ఏఐ అల్గోరిథమ్స్ డ్రైవర్ సీటును ఆక్రమిస్తోన్నాయి. మనుషుల ప్రమేయం లేకుండా సెన్సార్ డేటాను అర్థం చేసుకోవడం, వస్తువులను గుర్తించడం, రూట్ ప్లాన్ రూపొందించుకోవడం, సంక్లిష్ట వాతావరణంలో కూడా కారును నావిగేట్ చేయడానికి ఈ అల్గోరిథమ్స్ ఉపయోగపడతాయి. రియల్-టైమ్ సెన్సార్ డేటా ఇందులో కీలకం.

AI battle between Google OpenAI ChatGpt

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏ ఒక్క రంగానికో పరిమితం కాలేదు. చివరికి బ్రౌజింగ్ స్థితిగతులను కూడా ఇది సమూలంగా మార్చేసింది. టాప్ సెర్చింజిన్ గూగుల్ కు శక్తిమంతమైన ప్రత్యామ్నాయంగా ఎదిగింది. ఎక్స్ వంటి టెక్ దిగ్గజ సంస్థలు AI ఆధారిత సెర్చ్ టూల్స్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. ఇవి సమాచారాన్ని మరింత సులభంగా యూజర్లకు అందిస్తున్నాయి.

గూగుల్ సెర్చ్‌లో ఉండే ఒక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే- అది నేరుగా సమాచారాన్ని అందించదు. బదులుగా- సమాచారం ఎక్కడ దొరుకుతుందో సూచిస్తుంది. ఇది ఒక్కోసారి మనకు నచ్చిన విషయాల గురించి లోతైన అవగాహనను కలిగిస్తుంది. మనకు తెలియని విషయాల గురించి తెలుసుకోవడానికి సహాయపడుతుంది. కొన్నిసార్లు సూటిగా సమాధానం పొందడం కష్టమవుతుంది.

AI సెర్చ్ టూల్స్ మాత్రం దీనికి భిన్నం. తక్షణ సమాచారాన్ని అందిస్తోన్నాయి. OpenAI, Perplexity, ChatGPTకి వంటి AI సెర్చింజిన్లు తాజా సమాచారాన్ని అందివ్వడమే కాకుండా.. భూత-భవిష్యత్- వర్తమాన కాలాల్లో సంబంధిత అంశానికి చెందిన పూర్తి సమాచారాన్ని యూజర్ల కళ్ల ముందు ఉంచుతున్నాయి.

సాంప్రదాయ గూగుల్ సెర్చ్‌లో మనకు ఇష్టం వచ్చిన సమాచారం కోసం వెతకవచ్చు. కానీ AI సెర్చ్ మాత్రం మరింత వేగంగా, కచ్చితమైన సమాచారాన్ని అందించడానికి ప్రయత్నిస్తుంది. దీనివల్ల సెర్చ్ పై ఉండే ఆసక్తి, కుతూహలం తగ్గుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. AI టెక్నాలజీ కంపెనీలు ఆప్టిమైజేషన్ మీద దృష్టి పెడుతున్నాయనేది వారి వాదన.

ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలు AI వెబ్ ప్రపంచాన్ని మారుస్తుందని చెబుతున్నాయి. చాట్‌బాట్స్, సెర్చ్ ఇంజిన్లు సాంప్రదాయబద్ధమైన సెర్చ్ కు గట్టి పోటీ ఇస్తోన్నాయి. సాధారణ గూగుల్ సెర్చ్ ఒక ప్రశ్నను అర్థం చేసుకుని సంబంధిత ఫలితాలను చూపిస్తుంది. AI చాట్‌బాట్‌లు మనం అడిగే ప్రశ్నలను అర్థం చేసుకుని, సమాచారాన్ని విశ్లేషించి ఉపయోగకరమైన సమాధానాలను అందిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+