ఈ AI టూల్స్ ఫాలో అయితే మంచి జాబ్ గ్యారంటీ..!!

ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ ప్రవేశించింది. ప్రఖ్యాత సంస్థలు ఏఐ సేవలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏఐ కారణంగా లక్షలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. ఇదే సమయంలో ఇదే ఏఐ టూల్స్ సరిగ్గా వినియోగిస్తే మంచి ఉద్యోగం సంపాదించటం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో ఏఐ నైపుణ్యం వారికి మంచి ప్యాకేజీలతో ఉద్యోగాల కు ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారి కోసం కొత్త ఏఐ టూల్స్ అందుబాటులోకి వచ్చాయి.

నిరుద్యోగుల కోసం ప్రముఖ ప్రొఫెషనల్‌ నెట్‌వర్కింగ్‌ యాప్‌ లింక్డిన్‌ (LinkedIn) సరికొత్త ఏఐ టూల్స్ ను తీసుకువచ్చింది. వీటిని ఉపయోగించి ఉద్యోగాలను వెతుక్కోవడానికి వీలవుతుంది. నిరుద్యోగులు ఇప్పటి వరకు లింక్డిన్‌ లో తమకు కావాల్సిన జాబ్‌ పోస్టింగ్స్‌ను వెతకడం కోసం వివిధ రకాల ఫిల్టర్స్‌ను ఉపయోగిస్తూ వస్తున్నారు. కానీ ఇకపై ఆ అవసరం లేకుండా ఏఐ టూల్స్‌ ఆ పనిని మరింత సులభతరం చేయనున్నాయి. అయితే ఈ కొత్త ఫీచర్లు అందరు యూజర్లకు అందుబాటులో ఉండవు. కేవలం ప్రీమియం సబ్‌స్క్రైబర్లు మాత్రమే వీటిని అందుబాటులో ఉంచారు. వీటిల్లో ప్రధానంగా జాబ్‌ సీకర్‌ కోచ్‌. ఈ ఏఐ అసిస్టెంట్‌ వర్చువల్‌ రిక్రూటర్‌ తరహాలో పనిచేస్తుంది. మీరు సింపుల్​గా ఎలాంటి ఉద్యోగం కావాలో టైప్ చేస్తే చాలు, మీకు కావాల్సిన సమాచారం ఇస్తుంది.

ai-can-help-streamline-jobs-search-ten-tools-details-here

కోరుకున్న పోస్టుకు దరఖాస్తు చేసుకుంటే, మీ ప్రొఫైల్‌ ముందు వరుసలో ఉండేలా, ఎలాంటి మార్పులు చేయాలో కూడా తెలియజేస్తుంది. అదే విధంగా మరొకటి రెజ్యూమ్​ అండ్‌ అప్లికేషన్‌ రివ్యూ టూల్. ఇందులో రెజ్యూమ్​, అప్లికేషన్‌లను అప్‌లోడ్‌ చేయాలి. అప్పుడు వాటిని ఏఐ టూల్​ క్షుణ్ణంగా సమీక్షిస్తుంది. తరువాత తగు మార్పులు, చేర్పులు సూచిస్తుంది. జాబ్‌కు సెలెక్ట్‌ అయ్యేలా మీ రెజ్యూమ్​, అప్లికేషన్‌లలో ఏయే స్కిల్స్‌ను హైలైట్‌ చేయాలో కూడా సూచిస్తుంది. వీటితో పాటుగా కవర్‌ లెటర్‌ అసిస్టెన్స్‌. దరఖాస్తు చూడడానికి చాలా అట్రాక్టివ్ ​గా ఉండాలి. ఈ ఇంటరాక్టివ్ చాట్‌బాట్‌తో మీరు చాట్‌ చేస్తూ, మీ నైపుణ్యాలు, అనుభవం, ఎలాంటి ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నారు అనే విషయాలను తెలియజేయాలి. వాటికి అనుగుణంగా ఓ డ్రాఫ్ట్‌ కవర్‌ లెటర్‌ను ఈ ఏఐ టూల్​ క్రియేట్ చేసి ఇస్తుంది.

ఇక, వీటితో పాటుగా వివిధ రంగాలకు చెందిన నిపుణులు ఇచ్చిన సలహాలను ముందుగానే లింక్డిన్​ ఏఐ టూల్​లో నిక్షిప్తం చేశారు. వీటిని ఎప్పటికప్పుడు కొత్త వాటితో అప్‌డేట్‌ చేస్తుంటారు. కనుక యూజర్లు తమ సందేహాలను అడిగి, ఈ ఏఐ టూల్ ద్వారా తగిన సమాధానాలు తెలుసుకో వచ్చు. ఈ ఏఐ ఫీచర్లను ఉపయోగించడం ద్వారా యూజర్లు మరింత సమర్థవంతంగా, కావాల్సిన ఉద్యోగాన్ని వెతుక్కోవచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్లు కేవలం ప్రీమియం సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలో రిక్రూటింగ్‌ సంస్థలకు ఉపయోగపడేలా కొత్త ఏఐ టూల్స్ ​ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+