యూఎస్ నుంచి 38 గంటల ప్రయాణం- 1,010 కి.మీ. టాప్ స్పీడ్: ఆ బాంబర్ నేల వాలిందంటే భూకంపమే

ఇజ్రాయెల్‌- ఇరాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రతరమైంది. ఈ రెండు దేశాల మధ్య భీకర పోరు రోజురోజుకూ ముదురుతోంది.. కనివినీ ఎరుగని విధంగా ఉధృతమౌతోంది. వరుసగా 10 రోజూ దాడులు- ప్రతిదాడులతో అక్కడి నగరాలన్నీ కూడా అట్టుడికిపోతున్నాయి. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ యుద్ధంలో అమెరికా అడుగు పెట్టింది. ఇరాన్ లోని మూడు అణ్వాయుధ కేంద్రాలపై వైమానిక దాడులు సాగించింది. ఇరాన్‌ అణు స్థావరాలు- ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ పై అమెరికన్ దళాలు దాడులు చేశాయి. ఇరాన్ అణు సామర్థ్యాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ దాడులు చేపట్టింది.

AI explained How B2 Bomber works

ఈ దాడుల కోసం రెండు B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ క్రాఫ్ట్ లను అమెరికా ఉపయోగించింది. అలాగే- ఆరు GBU 57 మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్ల (MOP) ప్రయోగించింది. ఈ తరహా వార్ ఎయిర్ క్రాఫ్ట్ లను అమెరికా ఉపయోగించడం ఇదే మొదటిసారి. 30,000 పౌండ్లు అంటే సుమారు 15 టన్నుల బంకర్ బస్టర్ బాంబుతో కూడిన అమెరికన్ స్టెల్త్ బాంబర్లను ఫోర్డో అణు కేంద్రంపై జార విడిచింది.

ఒక్కో బీ2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ 15 టన్నుల బంకర్‌ బస్టర్ బాంబులను మోసుకెళ్లగలదు. భూమిలో లోతుగా పాతిపెట్టిన ఎటువంటి కట్టడాలనైనా ధ్వంసం చేసే సామర్థ్యం వీటికి ఉంది. ఈ తరహా బాంబులను అమెరికా వినియోగించడం ఇదే తొలిసారిగా ఫాక్స్ న్యూస్ వెల్లడించింది.

GBU-57 బాంబులు అమెరికా అమ్ములపొదిలో అత్యంత శక్తిమంతమైనవిగా భావిస్తారు. భూమిపై పడ్డ మరుక్షణమే ఇవి- ఉపరితలం నుంచి 200 అడుగుల వరకూ చొచ్చుకెళ్లగలవు. నేల అయినా..60 అడుగుల మందంతో నిర్మించిన రీ-ఎన్ ఫోర్స్డ్ కాంక్రీట్‌ అయినా చీల్చుకుని దూసుకెళ్లే సామర్థ్యం వీటికి ఉంది.

ఫోర్డో వంటి అత్యంత పటిష్టమైన ఇరాన్ భూగర్భ న్యూక్లియర్ స్థావరాన్ని సమూలంగా నాశనం చేయాలనే ఉద్దేశంతోనే ఈ జీబీయూ- 57 బాంబులను అమెరికా ప్రయోగించింది. ఇరాన్ లోని కోమ్ సిటీకి సమీపంలోని ఎత్తయిన పర్వతంపై ఫోర్డో న్యూక్లియర్ స్థావరం నిర్మితమైంది.

ఈ బాంబర్లను మోసుకొచ్చిన ఎయిర్ క్రాఫ్ట్ లు మిస్సోరీలో టేకాఫ్ తీసుకున్నాయి. 37 గంటల పాటు ఏకధాటిగా ప్రయాణం సాగించాయి. నేరుగా ఇరాన్ సిటీని చేరుకున్నాయి. వాటిని అడ్డుకునే విషయంలో ఇరాన్ దాదాపుగా చేతులు ఎత్తేసినట్టే కనిపించింది. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను దాటుకుని ఫోర్డో న్యూక్లియర్ స్థావరంపై బాంబుల వర్షాన్ని కురిపించాయి.

మిస్సైల్ ను పోలివుండే ఒక్కో జీబీయూ 57 బాంబు ఎత్తు 20.5 మీటర్లు. 31.5 అంగుళ డయామీటర్ వైశాల్యం గల ఈ బాంబర్ ను జారవిడిచిన వెంటనే తలకిందులుగా నేలపై పడుతుంది. దాని తలభాగం నేలపై వాలిన వెంటనే ముందు- వెనుక అమర్చిన రెక్కలు విచ్చుకుంటాయి. అవి భూమిని తొలిచేయడానికి ఉపయోగపడతాయి.

దాని గరిష్ట సామర్థ్యం 200 అడుగుల లోతు వరకు దూసుకెళ్తుంది. ఓ సాధారణ మిస్సైల్ తో పోల్చుకుంటే ఈ బాంబర్ బాడీని అత్యంత శక్తిమంతమైన మెటల్ తో తయారు చేస్తారు. మధ్యభాగంలో వార్ హెడ్ ను అమర్చుతారు. ఇందులో ప్రత్యేకంగా రూపొందించిన కంపార్ట్ మెంట్ లో పేలుడు వస్తువులను ఉంచుతారు.

ఈ వార్ హెడ్ లో 80 శాతం వరకు టీఎన్టీ ఉంటుంది. మిగిలిన 20 శాతం మేర అల్యూమినియం పౌడర్ మిశ్రమాన్ని అమర్చుతారు. అది పేలేందుకు అవసరమైన శక్తి ఉత్పన్నం కావడానికి అందులో టెయిల్ ఫ్యూజ్, థర్మల్ బ్యాటరీలు ఉంటాయి. నిర్దేంశించిన గమ్యస్థానాన్ని గుర్తించడానికి లేజర్ సెన్సార్, టెలిమెట్రీ యాంటీన్నా ఇందులో పొందుపరుస్తారు.

ఫోర్డో న్యూక్లియర్ స్థావరంపై అమెరికా వైమానిక దళం జారవిడిచిన ఈ బాంబర్ ఎలా పని చేసిందనే విషయాన్ని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విశ్లేషించింది. దీనికి సంబంధించిన ఓ షార్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని ఏఐ ట్యాలీ అనే సంస్థ రూపొందించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+