AI: రైతుల భవిష్యత్ మార్పు - ఏఐతో ఊహించని లాభాలు..!!
ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్. ఇప్పుడు ఏ రంగంలో చూసినా విప్లవంలా మారుతోంది. ప్రపంచంలో ఏఐ విస్తరిస్తోంది. ఏఐ కు ప్రయివేటులోనే కాదు.. ప్రభుత్వాల్లోనూ ప్రాధాన్యత పెరుగుతోంది. అదే సమయంలో ఉద్యోగుల పైన ఏఐ కత్తి వేలాడుతోంది. కొత్త కోర్సుల్లో నైపుణ్యంతో ఏఐ ఉద్యోగాలు భారీగా పెరుగుతున్నాయి. ఇక.. ఇప్పుడు వ్యవసాయ రంగంలోనూ ఏఐ విప్లవానికి కారణంగా నిలు స్తోంది. రైతు భవిష్యత్ మార్చేస్తోంది. లాభాల బాట పట్టిస్తోంది.
ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ - ఏఐ ఇప్పుడు వ్యవసాయ రంగంలోనూ కొత్త విప్లవానికి నాందిగా నిలు స్తోంది. బారామతి రైతుల ప్రయోగం ఈ మార్గంలో తొలి అడుగుగా నిలుస్తోంది. ఇక్కడ రైతులు ఏఐ వినియోగంతో సాధించిన ఫలితాలు దేశవ్యాప్తంగా రైతుల భవిష్యత్తు మార్పుకు సంకేతంగా నిలు స్తోంది. ఏఐ వ్యవసాయ విప్లవం తొలుత చెరుకు పంటతో మొదలైంది. దశల వారీగా ఇతర పంట లకూ విస్తరించనుంది. మన దేశంలో 60 శాతానికి పైగా వ్యవసాయం పైన ఆధారపడిన వారే ఉన్నారు. వారి సాగు విధానానికి సాంకేతికత జోడించటం ద్వారా అనూహ్య ఫలితాలు సాధిస్తు న్నారు. ఇప్పుడు ఏఐ వినియోగంతో వ్యవసాయ రంగంలో సాధించిన విజయంతో బారామతి రైతుల విజయం ప్రపంచవ్యాప్తంగా చర్చకు కేంద్రంగా మారింది.

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్ వంటి ప్రముఖులు స్పందించడం, ఇది సామాన్య రైతుకు ప్రపంచ గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ ప్రయోగం ద్వారా భారత రైతు గ్లోబల్ టెక్నాలజీ వేదికపై నిలిచింది. సాధారణంగా చెరకు నెలకు 2 నుంచి 2.5 కణుపులు పెరుగుతుంది. ఒక్కో గెడకు 45 కణుపులు ఉంటాయి. కానీ ఈ ఏఐ సాగులో నెలకు 3.5 నుంచి 4 కణుపులు పెరిగాయి. ఒక గెడలో మొత్తంగా 55 కణుపులు ఉంటాయి. సంప్రదాయ పద్ధతిలో ఎకరాకు రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు ఖర్చు అవుతుండగా.. ఆదాయం రూ.2 లక్షలు వస్తుంది. అదే ఏఐ సాగులో మాత్రం రూ.30 వేల నుంచి రూ.40 వేలు పెట్టుబడి పెడితే రూ.3 లక్షల దిగుబడి సంపాదించే అవకాశం ఉంది.
బారామతిలో విజయవంతమైన ఈ ప్రాజెక్ట్‌ను ఇతర రాష్ట్రాల్లోనూ అనుసరించేందుకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఫోకస్ చేసాయి. ఇప్పటికే రైతులు ఈ విధానాన్ని పరిశీలిస్తున్నారు. కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తున్నారు. ఏఐ వ్యవసాయాన్ని పూర్తిగా సాధించాలంటే రైతులకు శిక్షణ అవసరమని గుర్తించిన ప్రభుత్వాలు ఆ దిశగా కార్యాచరణ సిద్దం చేస్తున్నాయి. ఇందులో భాగంగా రైతులకు ఇంటర్నెట్, డిజిటల్ లిటరసీ కోసం కార్పోరేట్ సంస్థలతో కలిసి శిక్షణ దిశగా కసరత్తు జరుగుతోంది. ఏఐ వినియోగం ద్వారా రైతులకు భవిష్యత్ వచ్చే లాభాలను వివరిస్తూ.. వారిని శిక్షణ తీసుకునేలా ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది సక్సెస్ అయితే వ్యవసాయ రంగంలో కొత్త విప్లవం ఖచ్చితమనే అంచనాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications