తుపానును వారం ముందే గుర్తించే AI .. ఎలాగంటే..?
మొంథా తుపాను ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. గతంలోనూ అనేక తుపానులు పుట్టుకొచ్చాయి. తుపానులు ప్రధానంగా బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడుతుంటాయి. వీటి తీవ్రత, వేగాన్ని బట్టి 'తీవ్ర తుపాను' గా వర్గీకరిస్తారు. ఇక తెలుగు రాష్ట్రాలు బంగాళాఖాతానికి దగ్గరగా ఉండటం వల్ల తరచుగా తుపానులకు గురవుతుంటాయి. అయితే మారుతున్న సాంకేతికతతో వాతావరణ సమస్యలు, భారీ వర్షాలు, తుపానులు గుర్తిస్తున్నారు సాంకేతిక నిపుణులు. తుపానును ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సాయంతో వారం రోజుల ముందే గుర్తించొచ్చని తాజా పరిశోధనల్లో వెల్లడైంది.
యూనివర్సిటీ ఆఫ్ అలహాబాద్ లో కే. బెనర్జీ సెంటర్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ అండ్ ఓషియన్ స్టడీస్ విభాగానికి చెందిన కొందరు శాస్త్రవేత్తలు ఏఐ సాయంతో ఈ మోడల్ ను రూపొందించారు. దీని వల్ల తుపాను డైరెక్షన్.. తీవ్రత.. తదితర అంశాలను వారం రోజుల ముందే గుర్తించవచ్చని తెలిపారు. ఈ కట్టింగ్- ఎడ్జ్ ఏఐ మోడల్ .. ప్రస్తుతం ఉన్న వెథర్ ఫోర్ క్యాస్టింగ్ వ్యవస్థల కంటే అధికశాతం మెరుగ్గా.. కచ్చితత్వంతో కూడిన సందేశాలను ఇస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన పరిశోధనలను డచ్ సైంటిఫిక్ జర్నల్ నేచురల్ హజార్డ్స్ లో ప్రచురించారు.
టెస్టింగ్ లో భాగంగా ఈ ఏఐ మోడల్.. గతేడాది బంగాళాఖాతంలో ఏర్పడిన ధన, రెమాల్ అనే రెండు తుపానులను వారం ముందుగానే విజయవంతంగా గుర్తించింది. ధన తుపాను మే 24-28 వరకు అలాగే రెమాల్ అక్టోబర్ 22-26 వరకు ప్రభావాన్ని చూపాయి. ఈ రెండు తుపానులను వారం రోజుల ముందే విజయవంతంగా ఏఐ గుర్తించినట్లు టీమ్ లీడర్ ప్రొఫెసర్ సునీత్ ద్వివేదీ పేర్కొన్నారు. సంప్రదాయ వాతావరణ కేంద్రాల కంటే ఇవి కచ్చితత్వంతో అంచనా వేస్తాయని తెలిపారు.

ఈ ఏఐ మోడల్ గత తుపానుల చరిత్ర, వాటి తీవ్రత, శాటిలైట్ చిత్రాలు, వెథర్ రికార్డులు.. తదితర అంశాలను క్రోడీకరించి అంచనా వేస్తుంది. వాతావరణంలో ఒత్తిడి, సముద్ర ఉపరితర ఉష్ణోగ్రత, పీడనం.. తదితర అంశాలను సైతం స్టడీ చేస్తుంది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజల్ని అప్రమత్తం చేయడం, ప్రజల భద్రతకు ఇవి దోహదపడతాయి.












Click it and Unblock the Notifications