పెళ్లి సంబంధాలు వెతకడంలో 'ఏఐ' దూకుడు.. క్షణాల్లో సమాచారం మీ చేతికి..

పూర్వ కాలంలో పెళ్లి సంబంధాలు చూడాలంటే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసేవాళ్లు. తర్వాత పెళ్లి సంబంధాలు పురోహితులు తీసుకొచ్చేవాళ్లు. కాలం క్రమేణా లవ్ మ్యారేజీలు పెరిగిపోయాయి. ఆ తర్వాత మ్యాట్రిమోనియల్ సైట్స్ పుట్టగొడుగుల్లా వచ్చాయి. అయితే ఇంత టెక్నాలజీ మారినా సరైన వధువు లేక వరుడ్ని వెతుక్కోవడం ఇప్పటికీ కష్టంగానే ఉంటుంది చాలా మందికి. ఇక మ్యాట్రిమోనియల్ సైట్లలో లక్షల్లో ప్రొఫైల్స్ ఉంటాయి. వాటిల్లో ఏది బెస్ట్.. ఏది మనకు సూట్ అవుతుందో వెతుక్కోవడం కష్టమైన పనిగా మారింది. దీంతో మారుతున్న ట్రెండ్ ప్రకారం ఏఐ కూడా పెళ్లి సంబంధాలు చూస్తోంది.

మ్యాట్రిమోని యాప్‌లలోని లక్షల ప్రొఫైళ్లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) క్షణాల్లో వడపోస్తుంది. మనకు ఎలాంటి సంబంధం కావాలో ప్రాంప్టింగ్ ఇస్తే చాలు. ఏఐ సెకన్ల వ్యవధిలోనే తగిన వధూవరుల ఫోటోలను మన ముందు ఉంచుతుంది. ఏఐని వినియోగించుకుంటూ వాటి సేవల్ని మెరుగు పరుచుకుంటున్నాయి పలు మ్యాట్రిమోని సైట్లు. పెళ్లి సంబంధాల్లో మనకు సరైన వ్యక్తి, వయసు, ప్రాంతం, వృత్తి, ఉద్యోగం, అభిరుచుల వంటి అనేక ప్రాధాన్యతల ఆధారంగా సెర్చ్​ చేయడానికి ఏఐ చాలా సహాయ పడుతుంది. సదరు వ్యక్తి పంచుకున్న సమాచారం ప్రకారం అత్యంత అనుకూలమైన వ్యక్తిని మనకు సిఫార్సు చేయడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఉపయోగపడుతుంది.

AI Revolutionizes Matchmaking Finding Your Spouse in Seconds

అలాగే వధూవరుల జాతకాలను సైతం ఏఐ పూర్తిగా వివరిస్తుంది. అయితే మ్యాట్రిమోని సైట్స్ లో నకిలీ ప్రొఫైల్స్ తో ఎదుటి వ్యక్తిని నమ్మించి మోసం చేసే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎదుటి వారు ప్రలోభాలకు గురి చేసినా తమ వ్యక్తిగత సమాచారం ఏ మాత్రం పంచుకోవద్దని.. పరిచయం ఏర్పడిన వెంటనే ఫొటోలు పంపించొద్దని చెబుతున్నారు. అలాగే ఆర్థిక లావాదేవీలు కూడా జరపొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఇన్‌ స్టా, వాట్సాప్‌ వివరాలు అడిగినా ఇవ్వకపోవడమే మంచిదని సూచనలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+