ChatGPT అడల్ట్ మోడ్. ఇక్కడ అంతా అవే అంట! అందుకే బ్రేక్
టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన చాట్‌జీపీటీ (ChatGPT) ఇప్పుడు ఒక అనూహ్య నిర్ణయంతో వార్తల్లో నిలిచింది. తన వివాదాస్పద "అడల్ట్ మోడ్" (Adult Mode) ఫీచర్‌ను ఓపెన్‌ఏఐ ప్రస్తుతానికి పక్కన పెట్టింది. "పెద్దలను పెద్దలుగా చూద్దాం" అంటూ ఈ ఫీచర్‌ను వెనకేసుకొచ్చిన సామ్ ఆల్ట్‌మన్.. నిపుణుల హెచ్చరికలు, భద్రతా లోపాల దృష్ట్యా యూ-టర్న్ తీసుకోవాల్సి వచ్చింది. అసలు ఏమైంది? ఏఐతో శృంగార సంభాషణలు ఎందుకు ప్రమాదకరం?
ఈ ఫీచర్‌ను వాయిదా వేయడానికి ప్రధాన కారణం ఓపెన్‌ఏఐ అల్గారిథమ్ చేసిన పొరపాటే! మైనర్లను పెద్దలుగా గుర్తించడంలో కంపెనీ సాఫ్ట్‌వేర్ 12 శాతం సార్లు విఫలమైందని తేలింది. వారానికి దాదాపు 10 కోట్లకు పైగా మైనర్లు చాట్‌జీపీటీని వాడుతున్న తరుణంలో, ఈ చిన్న పొరపాటు పిల్లలను లైంగిక కంటెంట్‌కు బానిసలుగా మార్చే ప్రమాదం ఉందని నిపుణులు గట్టిగా హెచ్చరించారు.

సెక్సీ సూసైడ్ కోచ్‌గా ChatGPT మారుతుందా?
ఓపెన్‌ఏఐ అడ్వైజరీ బోర్డు సమావేశంలో నిపుణులు వ్యక్తం చేసిన ఆందోళనలు వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఏఐతో చేసే రొమాంటిక్ చాట్స్ మనుషులను ఒక వింతైన వ్యసనంలోకి నెట్టేస్తాయని, ఇది చివరకు "సెక్సీ సూసైడ్ కోచ్" తరహాలో అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఒక సభ్యుడు అభివర్ణించారు. నిజమైన మానవ సంబంధాలను పక్కన పెట్టి, రోబోలపై భావోద్వేగాల కోసం ఆధారపడటం వల్ల మానసిక ఆరోగ్య సమస్యలు వస్తాయని సైకాలజిస్టులు తేల్చి చెప్పారు.
పోటీలో ఇతర టెక్కులు..
ఓపెన్‌ఏఐ భయపడుతున్నా.. ఎలాన్ మస్క్‌కి చెందిన xAI (Grok) మాత్రం తన చాట్‌బాట్‌లో "ఆని" అనే రెచ్చగొట్టే అవతార్‌ను ప్రవేశపెట్టి దూకుడు ప్రదర్శిస్తోంది. అటు మెటా కూడా తన ఏఐలో పరిమితమైన రొమాంటిక్ రోల్ ప్లేను అనుమతించింది. కానీ, ఓపెన్‌ఏఐ మాత్రం "ముతక కంటెంట్" (Coarse Content) పేరుతో కేవలం టెక్స్ట్ సంభాషణలకు మాత్రమే పరిమితం కావాలని చూసినా, ప్రస్తుతానికి ఆ అడుగును కూడా వెనక్కి వేసింది.
భవిష్యత్తులో వచ్చే ఛాన్స్ ఉందా?
వాయిదా పడినంత మాత్రాన ఈ ఫీచర్ పూర్తిగా రద్దయినట్లు కాదు. వయస్సు అంచనా వేసే వ్యవస్థను మరింత పటిష్టం చేసి, యూజర్ల మానసిక శ్రేయస్సును దెబ్బతీయని విధంగా దీన్ని భవిష్యత్తులో తీసుకువస్తామని ఓపెన్‌ఏఐ స్పష్టం చేసింది. అయితే, ఏఐ అనేది కేవలం ఒక సహాయకుడిలా ఉండాలే తప్ప.. మనుషుల వ్యక్తిగత జీవితాల్లోకి 'ప్రేమికుడి'లా ప్రవేశించడం రిస్క్ తో కూడుకున్నదే!
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications