లవర్ మోసం చేసింది.. AI ప్రాణాలను కాపాడింది.. ఎలాగో తెలిస్తే షాక్..?
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) యుగం నడుస్తోంది. ప్రతి రంగాన్ని ఏఐ శాసిస్తోంది. మానవుడు పరిష్కరించలేని అనేక సమస్యలకు ఏఐ చిటికెలో సమాధానం ఇస్తోంది. తాజాగా ఏఐ మరో అద్భుతం చేసింది. ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమైన ఓ యువకుడి ప్రాణాలను కాపాడింది. ఆ యువకుడికి రెండో జీవితాన్ని ప్రసాదించింది. ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..?
ప్రస్తుత యుగంలో ఏఐ ఎంత అవసరమో ఈ ఘటన చెబుతుంది. ఉత్తర్ ప్రదేశ్ లోని ఆజాంఘఢ్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల యువకుడు ఆత్మహత్యకు పాల్పడేందుకు సిద్ధమయ్యాడు. తన లవర్ మోసం చేసిందన్న కారణంతో బలవన్మరణానికి సిద్ధపడ్డాడు. అయితే ఈ విషయం గురించి ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు. తాను చనిపోతున్నానని ఆ పోస్టులో పేర్కొన్నాడు. అది గుర్తించిన మెటా ఏఐ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు అతడి మొబైల్ నంబర్ ను ట్రాక్ చేసి ఆత్మహత్య నుండి ఆ యువకుడ్ని కాపాడారు.
ఉత్తరప్రదేశ్ ఆజాంఘడ్ కు చెందిన 19 ఏళ్ల యువకుడ్ని అతని ప్రియురాలు మోసం చేసినట్లు సమచారం. అంతేకాకుండా తనపై బెదిరింపులకు పాల్పడుతోందని ఆ యువకుడు తన ఇన్ స్టా ఖాతాలో పోస్టు పెట్టాడు. తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నట్లు పోస్టు చేశాడు. అయితే ఈ వివరాలన్నీ ఏఐ గుర్తించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది.

దీంతో వెంటనే స్పందించిన పోలీసులు యువకుడి మొబైల్ నంబర్ ట్రాక్ చేశారు. లొకేషన్ గుర్తించారు. కేవలం 15 నిమిషాల్లోనే అతడి ఇంటికి చేరుకున్నారు. అతనిని కాపాడి కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications