ఒకేసారి 83 మంది పిల్లలకు జన్మనిచ్చిన AI మంత్రి.. ఎలా సాధ్యం..?
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) యుగం నడుస్తోంది. ఏఐతో సాధించలేనిది ఏదీ లేదని మరోసారి రుజువైంది. అల్బేనియాకు చెందిన AI జనరేటెడ్ మినిస్టర్ డయెల్లా(అంటే సూర్యుడు అని అర్థం) గర్భం దాల్చినట్లు ఆ దేశ ప్రధాని ఎడిరామా ప్రకటించారు. 83 మంది పిల్లలకు జన్మనివ్వడం లేదా పార్లమెంట్ లోని ఒక్కో సోషలిస్ట్ పార్టీ సభ్యుడికి ఒక అసిస్టెంట్ ను క్రియేట్ చేయనున్నట్లు పేర్కొన్నారు. బెర్లిన్ లో జరిగిన గ్లోబల్ డైలాగ్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
" మేము ఈ రోజు డయెల్లాతో రిస్క్ చేశాము. కానీ మేము సఫలీకృతం అయ్యాం. తొలిసారి డయెల్లా ప్రెగ్నెంట్ అయ్యారు. ఆమెకు 83 మంది పిల్లలు పుట్టారు. వీరు పిల్లలు లేదా అసిస్టెంట్స్ గా ఉంటారు. పార్లమెంట్ లో జరిగే ప్రతి కార్యక్రమాన్ని వీళ్లు రికార్డు చేస్తారు. లెజిస్లేటర్లకు సాయపడతారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనే ప్రతి ఒక్కొ సభ్యుడికి ఒకరు అసిస్టెంట్ గా ఉంటారు. పార్లమెంట్ లో జరిగే ప్రతి విషయాన్ని పరిశీలిస్తారు. అవసరమైతే సభ్యులకు సూచనలు, సలహాలు ఇస్తారు. మరోసారి మరో 83 పిల్లలకు జన్మనిచ్చేందుకు డయెల్లా సిద్ధం" అని బెర్లిన్ లో జరిగిన గ్లోబల్ డైలాగ్ లో అల్బేనియా ప్రధాని ఎడిరామా తెలిపారు.

ఈ ఏఐ వ్యవస్థ 2026 చివరినాటికి మరిన్ని సత్ఫలితాలను ఇస్తుందని అల్బేనియా ప్రధాని ఎడిరామా స్పష్టం చేశారు. ఏఐ అసిస్టెంట్స్ ఎలా తమ విధులను నిర్వర్తిస్తాయో వివరించారు. " ఉదాహరణకు మీరు కాఫీకి వెళ్లి పార్లమెంట్ కు రావడం మర్చిపోతే .. ఈ చిన్నారి మీరు లేనప్పుడు సభలో ఏం జరిగిందో వివరిస్తుంది. మీరు ఎవరికి కౌంటర్ ఎటాక్ చేయాలో చెబుతుంది" అని వివరించారు. డయెల్లా ఏఐ ఆధారిత మంత్రిని సెప్టెంబర్ లో నియమించారు. దేశంలో అవినీతి రహిత సమాజం కోసం ఈ ఏఐ ఆధారిత మంత్రిని నియమించారు. ఈ ఏఐ జనరేటెడ్ మంత్రి సంప్రదాయ అల్బానియ్ లుక్ లో ఉంటుంది.












Click it and Unblock the Notifications