ఐఫోన్లల్లో అవి కంపల్సరీ
సర్వం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మయం అవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో యాపిల్ సంస్థ అదే బాట పట్టింది. AI ఫీచర్లను విడుదల చేయడంలో జాప్యం చోటు చేసుకుంటోందని, దీన్ని అధిగమించడానికి భారీ ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయని యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్ అన్నారు. నెక్స్ట్ జెన్ ఏఐ టెక్నాలజీని అభివృద్ధి చేస్తోన్నామని తెలిపారు.
యాపిల్ మూడో త్రైమాసిక ఫలితాలను ఆయన వెల్లడించారు. మూడో త్రైమాసికంలో యాపిల్ కార్యకలాపాలు 94 బిలియన్ల డాలర్లకు చేరుకున్నాయి. ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 10 శాతం అధికం. ఏప్రిల్- మే- జూన్ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ అమ్మకాలు 13 శాతం పెరిగాయి. వాటి విలువ 44.6 బిలియన్ డాలర్లు. సర్వీసెస్ ఆదాయం కూడా భారీగా పెరిగింది. 27.4 బిలియన్ డాలర్లను నమోదు చేసింది. ఇది ఆల్-టైమ్ హై.

ఈ సందర్భంగా టిమ్ కుక్ మాట్లాడారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మున్ముందు మరిన్ని విప్లవాత్మక మార్పులు సంభవిస్తాయని టిమ్ కుక్ అంచనా వేశారు. దీనికి అనుగుణంగా ఎప్పటికప్పుడు తమ పనితీరును మెరుగుపర్చుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఏఐని అన్ని డివిజన్లల్లో కూడా అడాప్ట్ చేసుకోవాలని భావిస్తోన్నామని అన్నారు.
ఈ క్రమంలో పెట్టుబడులను కూడా గణనీయంగా పెంచుతున్నామని టిమ్ కుక్ అన్నారు. అత్యంత అధునాతన సాంకేతికతను తమ వినియోగదారులకు చేర్చాలనేదే తమ ఉద్దేశమని, ప్రతి ఒక్క యూజర్ కూ అందుబాటులోకి తీసుకు వస్తామని చెప్పారు. దీనికోసం ఏఐని ఉపయోగించుకుంటామని అన్నారు.
ఏఐ టెక్నాలజీని అడాప్ట్ చేసుకునే క్రమంలో దీనికి సంబంధించిన ఆరుకు పైగా స్టార్టప్స్/కంపెనీలను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు టిమ్ కుక్ చెప్పారు. దీనికోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారీ మొత్తాన్ని కేటాయించనున్నట్లు వివరించారు. ఆయా కంపెనీల్లో వంద శాతం స్టేక్స్ కొనాలని ప్లాన్ చేసినట్లు చెప్పారు.
అలాగే- ఏఐ ప్రాజెక్టులపై ఎక్కువ మంది ఉద్యోగులను కేటాయిస్తోన్నామని అన్నారు. ఏఐకి సంబంధించినంత వరకు ప్రస్తుతం థర్డ్ పార్టీపై ఆధారపడుతున్నామని, దీని వల్ల సంస్థ క్యాపెక్స్ పెరిగిందని పేర్కొన్నారు. సంస్థ పురోగమించాలంటే విలీనాలు, కొనుగోళ్లు తప్పవని, అవి కూడా కార్యకలాపాల్లో ఓ భాగమని కుక్ స్పష్టం చేశారు.
యాపిల్ ఇంటెలిజెన్స్ బ్రాండింగ్ కింద 20కి పైగా కొత్త ఏఐ- ఆధారిత ఫీచర్లు ఇప్పటికే విడుదల చేశామని, వీటిలో విజువల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు, రైటింగ్ అసిస్టెంట్, క్లీనప్ టూల్ ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి నాటికి లైవ్ ట్రాన్స్‌లేషన్, AI వర్కౌట్ కంపానియన్‌ను విడుదల చేసే అవకాశం ఉందని చెప్పారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications