iPhone: దెబ్బేసిన యాపిల్..!!

ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్.. భారీగా లేఆఫ్స్ ప్రకటించింది. గ్లోబల్ సేల్స్ టీమ్‌లోని డజన్ల కొద్దీ ఉద్యోగులను తొలగించింది. ఇక ముందు కూడా లేఆఫ్స్ ఉంటాయని వెల్లడించింది. ఇప్పటివరకు ఎంతమందిని తొలగించిందనేది స్పష్టంగా తెలియరావట్లేదు గానీ.. ప్రపంచవ్యాప్తంగా పని చేస్తోన్న ఉద్యోగుల్లో దాదాపు రెండు శాతం వరకు కోత పెట్టిందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. ప్రత్యేకించి- సేల్స్ సహా పలు డివిజన్లలో ఈ ఉద్యోగ కోతలు సంభవించాయి.

వేటు పడిన వారిలో కార్పొరేట్ క్లయింట్లు, యూనివర్శిటీలు, ప్రభుత్వ విభాగాలతో నేరుగా సంప్రదింపులు జరిపే సేల్స్ టీమ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అకౌంట్ మేనేజర్లు కూడా లేఆఫ్స్ ఎదుర్కొన్న వారిలో ఉన్నట్లు బ్లూమ్ బెర్గ్ వెల్లడించింది. దీనిపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. యాపిల్ బ్రీఫింగ్ సెంటర్లను నిర్వహించే ఉద్యోగులు కూడా దీని బారిన పడ్డారు. తన కార్పొరేట్ సేల్స్ డివిజన్ ను పునర్వ్యవస్థీకరించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ కథనం తెలిపింది.

Apple Joins Layoff Wave with Job Cuts

ఎక్కువ మంది కొనుగోలుదారులను ఆకర్షించడంలో భాగంగా సేల్స్ టీమ్‌లో మార్పులు చేర్పులు చేస్తోన్నామని, ఇది ఉద్యోగులపై ప్రభావం చూపుతోందని యాపిల్ సీనియర్ మేనేజర్ పేర్కొన్నట్లు బ్లూమ్ బెర్గ్ వివరించింది. సేల్స్ సహా ఇతర డివిజన్లల్లో ఇప్పటికీ కొత్త నియామకాలు కొనసాగుతున్నాయని పేర్కొంది. తాజా లేఆఫ్స్ బారిన పడ్డ వారిలో యాపిల్ లో 20 నుండి 30 సంవత్సరాల అనుభవం ఉన్న కొంతమంది సీనియర్ మేనేజర్లు కూడా ఉన్నారు.

ఉద్యోగాలు కోల్పోయిన వారికి జనవరి 20వ తేదీ వరకు నోటీస్ పీరియడ్ ఇచ్చింది. ఈ లోగా కొత్త ఉద్యోగాలను వెదుక్కోవాల్సి ఉంటుంది వారికి. గడువు తర్వాత తొలగించడం ఖాయం. సేల్స్ డివిజన్ పునర్నిర్మాణం అనంతరం సంస్థ ఆదాయంలో పెరుగుదల కనిపించిందని యాపిల్ పేర్కొంది. డిసెంబర్ లో ముగియనున్న మూడో త్రైమాసికంలో దాదాపు 140 బిలియన్ డాలర్ల విలువ చేసే ఐఫోన్ విక్రయాలను సాధిస్తుందని అంచనా వేసింది.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరిగాక.. పలు సంస్థలు లేఆఫ్స్ బాట పట్టిన విషయం తెలిసిందే. టీసీఎస్, కాగ్నిజెంట్, మెటా, మైక్రోసాఫ్ట్.. వంటి దిగ్గజ కంపెనీలు AI పై భారీగా పెట్టుబడులు పెడుతోన్నాయి. వ్యయ నియంత్రణలో భాగంగా ఉద్యోగులను తొలగించాయి. ఈ కంపెనీల జాబితాలో ఇప్పుడు యాపిల్ కూడా చేరింది. తొలగింపులు చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయని బ్లూమ్ బెర్గ్ అంచనా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+