హోటల్ రంగంలో కీలకంగా మారిన ఏఐ.. అన్ని సేవలు ఏఐతోనే!
భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాలలోనూ కీలక భూమిక పోషిస్తుంది. ముఖ్యంగా ఆతిథ్య రంగంలో కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హోటల్ కార్యకలాపాలను ఈజీ చేసింది. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం అతి తక్కువ మానవ సామర్థ్యంతో కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా సేవలను అందిస్తూ కృత్రిమ మేధస్సు (AI) హోటల్ రంగాన్ని మార్చుతోంది. ఇది మన ఆతిథ్య రంగ సామర్థ్యాన్ని మరియు కస్టమర్ సేవను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
హోటల్స్ లో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్
అనేక హోటళ్లు కస్టమర్లకు అందించే వివిధ సేవలను సులభతరం చేయడానికి AI సాధనాలను వినియోగిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బుకింగ్‌లను నిర్వహించడం, అతిథుల అనుభవాలను వ్యక్తిగతీకరించడం , అతిథులకు కావలసిన వనరుల కేటాయింపును ఆప్టిమైజ్ చేయడం వంటివి చేస్తున్నారు. అంతే కాదు కొన్ని లగ్జరీ హోటల్స్ లో మెయింటెనెన్స్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేస్తున్నారు.

హోటల్స్ లో AI ఆధారిత చాట్‌బాట్‌లు
AI ఆధారిత చాట్‌బాట్‌లు హోటళ్లలో సాధారణంగా మారుతున్నాయి. అవి కస్టమర్ ప్రశ్నలను నిర్వహిస్తాయి . అంతేకాదు వారి నుండి తక్షణ ప్రతిస్పందనలు సేకరించి, కస్టమర్లకు మెరుగైన సర్వీస్ ను అందించడానికి కావలసిన సమాచారాన్ని సదరు హోటల్ కు అందిస్తాయి . ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిబ్బందిపై పని భారాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు అతిథుల సంతృప్తిని మెరుగుపరచడానికి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తన వంతు పాత్రను పోషిస్తుంది.
ఆదాయ నిర్వహణలో, భద్రతలోనూ ఏఐ
ఆదాయ నిర్వహణలోనూ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది డేటాను విశ్లేషించి డిమాండ్‌ను అంచనా వేయడానికి మరియు పోటీ ధరలను నిర్ణయించడానికి సహాయపడుతుంది. ఇది అతిథులకు హోటల్లో స్టే చేయడానికి అయ్యే ఖర్చును అందిస్తూనే హోటళ్లకు ఆదాయాన్ని గరిష్టం చేయడంలో సహాయపడుతుంది.ఇవి మాత్రమే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హోటల్స్ లో భద్రతా చర్యలను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.
హోటల్స్ నిర్వహణ సునాయాసంగా జరిగేలా చేస్తున్న ఏఐ
ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ ద్వారా భద్రతా చెక్-ఇన్ లు నిర్వహించడం వంటి వాటితో అతిథులకు సురక్షితమైన వాతావరణాన్ని నిర్ధారిస్తుంది. భారతీయ హోటళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరుగుతున్న కొద్ది హోటల్స్ నిర్వహణ సునాయాసంగా జరుగుతుంది. ఇవి అనేక ప్రయోజనాలను కలిగించడంతో పాటు, ఖర్చును తగ్గిస్తూ, కస్టమర్లకు కూడా సంతృప్తిని కలిగిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంతో హోటల్ సెక్టార్ కు కలుగుతున్న లాభాలను దృష్టిలో పెట్టుకొని చాలామంది దాని వైపు మొగ్గు చూపుతున్నారు.












Click it and Unblock the Notifications