విస్తరిస్తున్న ఏఐ.. రాబోయే 20 ఏళ్లు గందరగోళం.. బిల్ గేట్స్ సంచలన వ్యాఖ్యలు
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) గణనీయంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి రంగంలోనూ ఏఐ క్రమంగా విస్తరిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్, బిలియనీర్, మానవతావాది బిల్ గేట్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న 20 ఏళ్లలో ఏఐ ద్వారా ఉద్యోగాల్లో భారీ మార్పులు రాబోతున్నాయని అంచనా వేశారు. ఏఐ మరింత సమృద్ధిగా అందరికీ అందుబాటులోకి రానుందని తెలిపారు. కానీ దీనివల్ల వర్కర్లు, అలాగే సమాజానికి చాలా ప్రమాదకరం అని పేర్కొన్నారు. ఈ పరివర్తన పీరియడ్ లో ఉద్యోగులు అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటారని స్పష్టం చేశారు. ఈ కాలం అత్యంత గందరగోళంగా ఉంటుందని బిల్ గేట్స్ అంచనా వేశారు. డికోడర్ అనే పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు బిల్ గేట్స్.
ఈ ఏఐ పరివర్తన కారణంగా కొంతమంది విజేతలుగా.. మరికొంతమంది ఫెయిల్యూర్స్ గా మిగిలిపోతారని బిల్ గేట్స్ అంచనా వేశారు. వ్యాపారం రంగంలో ఏఐ వినియోగం గణనీయంగా పెరగడం కారణంగా అనేక మంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటారని స్పష్టం చేశారు. రోబోలు అందుబాటులోకి వస్తే వర్కర్లపై ఆధారపడటం తగ్గుతుందని డీకోడర్ పాడ్ కాస్ట్ లో బిల్ గేట్స్ తెలిపారు.
మరోవైపు ఆఫీస్ నుంచి చేసే ఉద్యోగాలపై బిల్ గేట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో టెలిఫోన్ సేల్స్, కస్టమర్ సపోర్ట్ అలాగే అకౌంటింగ్ వంటి ఉద్యోగాలు ఏఐ కారణంతో కనుమరుగవుతాయని పేర్కొన్నారు. ఎందుకంటే మానవుల కంటే ఏఐ ఈ పనులను అత్యంత వేగంగా చేస్తుందని బిల్ గేట్స్ స్పష్టం చేశారు. అలాగే తక్కువ ఖర్చు.. కచ్చితత్వంతో ఈ పనులను ఏఐ నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే మానవులు చేయగలిగే అనేక పనులను ఏఐ సమర్థవంతంగా నిర్వహిస్తోందని గుర్తు చేశారు. వాటిలో కస్టమర్స్ అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం.. మేనేజింగ్ సపోర్ట్ రిక్వెస్ట్ లు.. అలాగే ప్రాసెసింగ్ ఫైనాన్షియల్ సమాచారం.. తదితర విభాగాల్లో ఏఐ పనులను సమర్థవంతంగా నిర్వహిస్తోందని పేర్కొన్నారు.

అలాగే రానున్న రోజుల్లో హుమానాయిడ్ రోబోలు మానవులు చేసే ఫిజికల్ వర్క్ ను కూడా చేస్తాయని బిల్ గేట్స్ తెలిపారు. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లో కార్మికులు చేతులతో చేసే పనిని రోబోలు సమర్థవంతంగా నిర్వహిస్తాయని పేర్కొన్నారు. రానున్న కాలంలో రోబోలు ఇంటి నిర్మాణాలు, ఫుడ్ గ్రోయింగ్ తో పాటు సర్జరీలు కూడా చేస్తాయని తెలిపారు. మానవుల కంటే రోబోలు దాదాపు అన్ని పనులను సమర్థవంతంగా చేయడం ఆందోళన కలిగించే అంశంగా బిల్ గేట్స్ అభివర్ణించారు.












Click it and Unblock the Notifications
