AI పై కేంద్రం ఫ్రీ కోర్సులు: ఆలస్యం.. అమృతం విషం

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విశ్వవ్యాప్తమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. దీనిపై ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసింది.. అది కూడా ఫ్రీగా. ఈ మేరకు కేంద్ర విద్య మంత్రిత్వ శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకుంది.

విద్యార్థుల కోసం స్వయం (SWAYAM) పోర్టల్‌లో ఉచితంగా AI కోర్సులను అందిస్తోంది. దీని ద్వారా విద్యార్థులు సాంకేతికతలో తాజా మార్పులకు అనుగుణంగా తమ పరిజ్ఞానాన్ని పెంచుకోవచ్చు. SWAYAM ప్లాట్‌ఫామ్ ద్వారా పాఠశాల నుండి పోస్ట్-గ్రాడ్యుయేషన్ స్థాయి వరకు ఉచిత ఆన్‌లైన్ విద్యా అవకాశాలను అందిస్తోంది.

Boost Your Skills with Free AI Courses Available on Swayam Portal

వివిధ రంగాల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కు పెరుగుతున్న ప్రాముఖ్యత నేపథ్యంలో- ఈ కోర్సులు.. ఫ్యూచర్ టెక్నాలజీ, సరికొత్త ఆవిష్కరణలు, పరిశోధన వంటి రంగాలలో విద్యార్థులు రాణించడానికి అవసరమైన నైపుణ్యాలను అందించగలుగుతాయని కేంద్రం పేర్కొంది.

స్వయం పోర్టల్‌లో అందుబాటులో ఉన్న అయిదు ఉచిత AI కోర్సులు ఇవే..

1. AI/ML: పైథాన్ ఉపయోగించడం ద్వారా ఈ కోర్సుకు సంబంధించి విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ వంటి ప్లాట్ ఫామ్ లపై బేసిక్ అంశాలపై శిక్షణ పొందవచ్చు. మేథమేటిక్స్, లీనియర్ ఆల్ జీబ్రా, ఆప్టిమైజేషన్, డేటా విజువలైజేషన్‌.. ప్రధానంగా ఇది రూపుదిద్దుకుంది. డేటా సైన్స్‌లో విస్తృతంగా ఉపయోగించే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ను కూడా ఇది కవర్ చేస్తుంది. మొత్తం 36 గంటల ఈ కోర్సు.. ముగింపు దశలో సర్టిఫికేషన్ అసెస్ మెంట్ టెస్ట్ కూడా ఉంటుంది.

2. AI తో క్రికెట్ అనలిటిక్స్: ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్‌లు అందిస్తున్న కోర్సు ఇది. క్రికెట్‌ను ప్రధానంగా తీసుకొని పైథాన్ ఉపయోగించి స్పోర్ట్స్ అనలిటిక్స్ లో బేసిక్స్ ను నేర్చుకోవచ్చు. 25 గంటల ఈ ప్రోగ్రామ్ మల్టీ ఆప్షనల్ ఎగ్జామ్ తో ముగుస్తుంది.

3. ఫిజిక్స్‌లో AI: మెషీన్ లెర్నింగ్, న్యూరల్ నెట్‌వర్క్‌, రియల్ టైమ్ వరల్డ్ ఫిజిక్స్ వంటి అంశాల్లో తలెత్తే సమస్యలను ఎలా పరిష్కరించవచ్చనేది ఈ కోర్సు ద్వారా నేర్చుకోవచ్చు. ఇందులో ఇంటరాక్టివ్ సెషన్స్, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్, హ్యాండ్స్-ఆన్ ల్యాబ్ వర్క్స్ వంటివి ఉంటాయి. ఈ కోర్స్ మొత్తం వ్యవధి 45 గంటలు.

4. అకౌంటింగ్‌లో AI: కామర్స్, మేనేజ్‌మెంట్ విద్యార్థుల కోసం రూపొందించిన ప్రోగ్రామ్ ఇది. అకౌంటింగ్ లో AI ఎలా వర్తిస్తుందనేది దీని ద్వారా నేర్చుకోవచ్చు. 45 గంటల ఈ కోర్సు సర్టిఫికేషన్ అసెస్ మెంట్ కూడా పొందవచ్చు.

5. కెమిస్ట్రీలో AI: రియల్ టైమ్ వరల్డ్ కెమిస్ట్రీ డేటాసెట్‌ను ఉపయోగించడం ద్వారా AI, పైథాన్ ఎలా మాలిక్యులర్ ప్రాపర్టీస్, మోడల్ రియాక్షన్స్, డిజైన్ డ్రగ్స్ వంటివి నేర్చుకోవచ్చు. ఐఐటీ మద్రాస్ ఈ కోర్సును అందిస్తోంది. దీని కాల వ్యవధి 45 గంటలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+