కొత్త ఏఐ టూల్ తీసుకొచ్చిన చాట్ జీపీటీ..

మారుతున్న కాలానుగుణంగా సాంకేతికత కూడా దినదినాభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) హవా నడుస్తోంది. టెక్నాలజీ రంగంలో జరుగుతున్న వేగవంతమైన పరిణామాలు కొత్త పరికరాలను, సాఫ్ట్‌వేర్ టూల్స్‌ను పరిచయం చేస్తున్నాయి. చాట్‌ జీపీటీ వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కోడింగ్ ప్రక్రియను మరింత సమర్థవంతంగా చేయాలనే లక్ష్యంతో OpenAI రూపొందించిన కొత్త కోడింగ్ ఏజెంట్ Codex (కోడెక్స్) ను ప్రవేశపెట్టింది.

Codex అంటే ఏమిటి?

Codex అనేది OpenAI అభివృద్ధి చేసిన ఓ క్లౌడ్ ఆధారిత కోడింగ్ ఏజెంట్. ఇది సాధారణంగా ప్రోగ్రామర్లకు సహాయంగా పనిచేస్తుంది. ఫీచర్ డెవలప్‌మెంట్, బగ్ ఫిక్సింగ్, కోడ్ సమీక్షలు, టెస్టింగ్ మొదలైన టాస్కులను ఇది నిర్వహించగలదు. ఇది ఒకేసారి అనేక పనులను ప్యారలల్‌గా నడిపించగల సామర్థ్యం కలిగిన ఏజెంట్. కోడెక్స్, ChatGPTలో integreated గా ఉంటూ, వినియోగదారులు ఇచ్చే సూచనల ప్రకారం వారి కోడ్‌బేస్‌లో ప్రత్యక్షంగా మార్పులు చేయగలదు.

chat-gpt-introduces-new-ai-tool-codex

Codex ప్రత్యేకతలు..

  • Codex OpenAI యొక్క O3 మోడల్ ఆధారంగా రూపొందించబడింది. ఇది ప్రత్యేకంగా రియల్ వరల్డ్ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి సమస్యలను ఎదుర్కొనేలా ట్రెయినింగ్ పొందింది.
  • Pull Requests తయారీ, కోడ్ లింటింగ్, టైప్ చెకింగ్, టెస్ట్ అమలు వంటి కార్యకలాపాలను నిర్విరామంగా నిర్వర్తించగలదు.
  • యూజర్ ఇచ్చే ప్రశ్నలను, కాంటెక్స్ ఆధారంగా అర్థం చేసుకుని, విశ్లేషించి సమర్థవంతమైన సమాధానాలు ఇస్తుంది.

ఇది సమయం ఆదా చేయడంలో, బగ్‌లు తొలగింపునకు బాగా ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు. ఆటోమేటెడ్ టెస్టింగ్, సెక్యూరిటీ, ఇంటెలిజెంట్ అసిస్టెంట్‌గా పనిచేయడం, అవేలబిలిటీ దీనికున్న మరిన్ని ప్రత్యేకతలు అని చెప్పొచ్చు.

Codex ప్రస్తుతానికి ChatGPT Pro, Enterprise, Teams ప్లాన్‌లలో ఉన్న వినియోగదారులకు స్టెప్పింగ్ రోలౌట్‌గా అందుబాటులోకి తీసుకురాబడుతోంది. ఈ ప్లాన్‌లను సబ్‌స్క్రైబ్ చేసిన వారు ముందుగా దీనిని ఉపయోగించవచ్చు. త్వరలోనే Plus మరియు Edu ప్లాన్‌ల వినియోగదారులకు కూడా సపోర్ట్ చేయించేందుకు ప్లాన్ చేస్తున్నామని కంపెనీ తెలిపింది. ఇది పూర్తి స్థాయిలో విడుదల అయిన తరువాత, విద్యార్థులు, ప్రొఫెషనల్ డెవలపర్లు దీన్ని విస్తృతంగా ఉపయోగించగలరని వెల్లడించింది.

ఎలా ఉపయోగించాలి అంటే..?

Codexని ChatGPT ఇంటర్‌ఫేస్‌లోని సైడ్‌బార్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. ఒకసారి మీరు ప్రాంప్ట్ ఇచ్చాక, అక్కడి నుండి మీరు ప్రాజెక్టుకు కావలసిన టాస్కులను కేటాయించవచ్చు. మీ కోడ్‌బేస్ లోపల ఏ భాగంలో సహాయం అవసరమో స్పష్టంగా చెప్పగలుగుతారు. "Ask" అనే బటన్‌ ద్వారా మీ కోడ్ గురించి ప్రశ్నలు వేయవచ్చు. ఫీచర్ ఇంప్లిమెంట్ చేయమని, బగ్ ఫిక్స్ చేయమని, టెస్ట్ రాయమని ఆదేశాలు ఇవ్వవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+