కోకా కోలాలో మీ ఉద్యోగాలు జాగ్రత్త- భారీగా లేఆఫ్స్..!!
కోకా-కోలా బెవరేజెస్ లే ఆఫ్స్ కు సిద్ధపడింది. 600 మందికి పైగా ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం భారీగా పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ టాప్ బేవరేజెస్ కంపెనీ.. ఈ నిర్ణయం తీసుకుంది. బాట్లింగ్ సహా ఇతర డివిజన్లల్లో ఏఐని విస్తృతంగా వినియోగించనున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు టెక్ సంస్థలకే పరిమితమైన లేఆఫ్స్ కత్తి తాజాగా ఇతర రంగాలకూ విస్తరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఫుడ్ అండ్ అలైడ్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధి డొమినిక్ స్వార్ట్జ్ ఇచ్చిన ఒక ప్రకటనను తన కథనానికి ఉటంకిస్తూ బ్లూమ్ బర్గ్ ఓ కథనాన్ని ప్రచురించింది. లేఆఫ్స్ ప్రక్రియను ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. కోకా కోలా యాజమాన్యం ఈ ప్రక్రియను మొదలు పెట్టిందని, ఉద్యోగాల కోతపై కంపెనీ సంప్రదింపులను చేపట్టిందని డొమినిక్ స్వార్ట్జ్ వెల్లడించారు. ఇప్పటికే ఈ దిశగా తమకు నోటీసులు సైతం ఇచ్చిందని అన్నారు.

దీనిపై యూనియన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పటికే జాబ్ మార్కెట్ బలహీనంగా ఉన్నందున, ఈ చర్య మరింత తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందని యూనియన్ ఆందోళన వ్యక్తం చేసింది. 2016 జులైలో ఆరు నాన్-ఆల్కహాలిక్ బాట్లింగ్ కంపెనీల విలీనం చేసుకోవడం ద్వారా కోకా-కోలా బెవరేజెస్.. దక్షిణాఫ్రికాలో అడుగు పెట్టింది. కోకా కోలా బేవరేజెస్ సౌత్ ఆఫ్రికా పేరుతో కొత్త మార్కెటింగ్ కార్యకలాపాలను చేపట్టింది.
ఆశించిన స్థాయిలో డిమాండ్ లేకపోవడం, ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతోన్న నేపథ్యంలో కొన్ని డివిజన్లల్లో ఉద్యోగాల్లో కోత పెట్టాలని నిర్ణయించినట్లు యూనియన్ స్పష్టం చేసింది. ఆర్టిఫీషీయిల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని పెంచుకోవడం వల్ల మ్యాన్ పవర్ ను తగ్గించాలనేది కంపెనీ యాజమాన్యం ఆలోచనగా చెబుతున్నారు. దక్షిణాఫ్రికాలో పెరుగుతున్న నిరుద్యోగాన్ని ఈ చర్య మరింత పెంచుతుందనే ఆందోళనలు వ్యక్తమౌతోన్నాయి.
ప్రపంచంలోనే అత్యధిక నిరుద్యోగ రేటు ఉన్న దేశాలలో దక్షిణాఫ్రికా ఒకటి. ఇటీవల, ఫోర్డ్ మోటార్ కో., గ్లెన్‌కోర్ పిఎల్‌సి, ఆర్సెలర్‌మిట్టల్ ఎస్‌ఏ వంటి పెద్ద కంపెనీలు కూడా లేఆఫ్స్ ప్రకటించాయక్కడ. డొనాల్డ్ ట్రంప్ దక్షిణాఫ్రికా ఎగుమతులపై 30 శాతం టారిఫ్ ను విధించడం సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తోంది. ఈ టారిఫ్ వల్ల సుమారు లక్ష ఉద్యోగాలను ప్రమాదంలో పడేస్తాయని దక్షిణాఫ్రికా సెంట్రల్ బ్యాంక్ హెచ్చరించింది.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications