Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏఐ కోసం బరిలోకి దిగిన బాలీవుడ్ బ్యూటీ!

Artificial Intelligence: ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీ వినియోగదారులకు మరింత చేరువవుతున్న తరుణంలో మెటా సంస్ఠ ఓ వినూత్నమైన నిర్ణయం తీసుకుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఇప్పుడు మెటా ఏఐ వాయిస్‌గా మారారు. దీని అర్థం మెటా ఏఐతో ఎవరైనా ప్రశ్నలు అడగాలనుకున్నా లేదా మాట్లాడలనుకున్నా.. వారికి బాలీవుడ్ నటి దీపికా పదుకొణె స్వరం వినిపించనుంది. ఈ ప్రత్యేక సదుపాయం భారతదేశంతో సహా యునైటెడ్ స్టేట్స్, కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో సహా పలు అంతర్జాతీయ మార్కెట్లలో అందుబాటులో ఉంటుంది.

దీపికా పదుకొణె ప్రకటన
దీపికా పదుకొణె ఈ విషయాన్ని స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో ద్వారా వెల్లడించారు. స్టూడియోలో వాయిస్ రికార్డింగ్ చేస్తున్న దృశ్యాలను పంచుకుంటూ.. "హాయ్, నేను దీపికా పదుకొణెను. నేను మెటా AIకి కొత్త వాయిస్‌ని! కాబట్టి రింగ్‌ను నొక్కండి. నా వాయిస్‌ను వినండి," అని రాసుకొచ్చారు. ఆంగ్ల భాషలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని, ఈ ఫీచర్ చాలా 'కూల్'గా ఉందని, మెటా AI ని మరింత సరదాగా మారుస్తుందని ఆమె పేర్కొన్నారు.

Deepika Padukone Becomes the Voice of Meta AI A Bold Tech Move

మెటా AIకి ఇది ఎందుకు 'స్మార్ట్ మూవ్'?
కృత్రిమ మేధస్సు రంగంలో గూగుల్, ఓపెన్ ఏఐ వంటి దిగ్గజ సంస్థలతో మెటా తీవ్రంగా పోటీ పడుతోంది. ఈ ఏఐ రేసులో మెటా తనను తాను ప్రత్యేకంగా నిలబెట్టుకోవడానికి ప్రముఖ వ్యక్తుల సహకారాన్ని తీసుకోవడం ఒక తెలివైన వ్యూహంగా నిలుస్తుంది. ఇండియాతో సహా ప్రపంచవ్యాప్తంగా దీపికా పదుకొణెకు ఉన్న అపారమైన అభిమాన గణం, మెటా ఏఐ మరింత మంది ఆకర్షణగా నిలుస్తుంది. ఓ పరిచితమైన, ఆకర్షణీయమైన స్వరం వినియోగదాలకు ఏఐతో మరింత సన్నిహితంగా సంభాషించే అనుభూతిని ఇస్తుంది.

'రే-బాన్ మెటా గ్లాసెస్'లో రానున్న విప్లవాత్మక ఫీచర్లు
మెటా ఏఐ వాయిస్‌తో పాటు త్వరలో ఇండియాలో రే-బాన్ మెటా గ్లాసెస్ కోసం మరిన్ని వినూత్న ఫీచర్లు రాబోతున్నాయి. ఈ స్మార్ట్ గ్లాసెస్‌ను మరింత ఉపయోగకరంగా మార్చే లక్ష్యంతో మెటా ఈ అప్‌డేట్‌లను తీసుకువస్తోంది. వినియోగదారులు తమ చేతులను ఉపయోగించకుండా, కేవలం గొంతు ఆదేశాల ద్వారా మెటా AIతో సంభాషించగలుగుతారు. ఏఐతో హిందీలో మాట్లాడే అవకాశం లభిస్తుంది. గ్లాసెస్ ద్వారానే యూపీఐ లైట్ సదుపాయంతో సులభంగా చెల్లింపులు చేసే ఫీచర్ అందుబాటులోకి రానుంది. పండుగలు లేదా ప్రత్యేక సందర్భాలకు అనుగుణంగా ఫోటోలను మార్చే (రీస్టైలింగ్) లేదా మెరుగుపరిచే ఫీచర్ అందుబాటులోకి వస్తుంది.

మరో బాధ్యతను కూడా స్వీకరించిన దీపికా పదుకొణె
సినీ జీవితానికి అదనంగా దీపికా పదుకొణె ఇటీవల మరో ముఖ్యమైన బాధ్యతను కూడా స్వీకరించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమెను మానసిక ఆరోగ్యం కోసం తమ మొదటి అంబాసిడర్‌గా నియమించింది. ఇది ఆమెకున్న సామాజిక బాధ్యత, ప్రజాదరణకు నిదర్శనం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+