Your Year with ChatGPT: మీ సెర్చ్, ఛాటింగ్ డేటా గుట్టు తెలిసిపోద్ది..!!

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజం ఓపెన్ఏఐ (OpenAI) ఓ సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇయర్ ఎండర్ ను దృష్టిలో పెట్టుకుని దీన్ని ప్రవేశపెట్టింది. 'యువర్ ఇయర్ విత్ చాట్‌జీపీటీ' (Your Year with ChatGPT) అనే పర్సనలైజ్డ్ రికాప్ ఫీచర్‌ ఇది. ఈ ఏడాదిలో యూజర్లు ఇప్పటివరకు ఏమేం సెర్చ్ చేశారో.. రీకాప్ చేస్తుంది. అంటే- ఈ ఏడాది మన సెర్చింగ్, ఛాటింగ్ డేటాను మరోసారి గుర్తుకు తెచ్చుకోవచ్చన్నమాట.

యూజర్లు ఏడాది పొడవునా AI చాట్‌బాట్‌ను ఎలా ఉపయోగించారనే విషయాన్ని రివ్యూ చేస్తుంది. ఓ చిన్న సైజు సమీక్షగా దీన్ని అందిస్తుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలోని ప్రముఖ వార్షిక సారాంశాలను ఇది పోలి ఉంటుంది. ఈ ఫీచర్ ప్రస్తుతానికి అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లల్లో అందుబాటులో ఉందని ఓపెన్‌ఏఐ వెల్లడించింది. దీనిపై తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో ఓ పోస్ట్ షేర్ చేసింది.

Discover Your Year with ChatGPT A Personalised Summary of Your AI Usage

దీన్ని తెలుసుకోవడానికి రిఫరెన్స్ సేవ్ చేసిన మెమరీ, చాట్ హిస్టరీ ఆన్ చేసి, యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలని వినియోగదారులకు సూచించింది ఓపెన్ ఏఐ. రిఫరెన్స్ సేవ్ చేసిన మెమరీ, చాట్ హిస్టరీ ఆన్ చేసిన అందరికీ యువర్ ఇయర్ విత్ చాట్‌జీపీటీ అందుబాటులోకి వచ్చిందని తెలిపింది. యాప్ అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. అప్ డేట్ పూర్తయిన తర్వాత యాప్ హోమ్ స్క్రీన్‌పై సంబంధిత బ్యానర్ దర్శనమిస్తుంది.

దీన్ని క్లిక్ చేయగానే ఈ సంవత్సరంలోని ముఖ్యాంశాలతో కూడిన స్టోరీస్- స్టైల్డ్ రికాప్ ప్రారంభమవుతుంది. ఇందులో వినియోగ విధానాలు, తరచుగా చర్చించిన అంశాలు, అలాగే 'క్రియేటివ్ థింకర్' లేదా 'ప్రాబ్లమ్ సాల్వర్' వంటి సరదా టైటిల్స్ ఉంటాయి. ఈ రికాప్ వినియోగదారుల చాట్‌ల థీమ్‌ల ఆధారంగా ఓ పొయెట్, AI-సృష్టించిన ఫొటో కూడా అందిస్తుంది. వ్యక్తిగత ముఖ్యాంశాలను సోషల్ మీడియాలో సులభంగా పంచుకునేలా దీని డిజైన్ ఉందని ఓపెన్‌ఏఐ వివరించింది.

'యువర్ ఇయర్ విత్ చాట్‌జీపీటీ' వ్యక్తిగత ఖాతాలకు మాత్రమే పరిమితం. ఎడ్యుకేషన్, ఎంటర్‌ప్రైజ్ లేదా టీమ్ సబ్‌స్క్రిప్షన్‌లకు ఇది అందుబాటులో ఉండదు. బ్యానర్ కనిపించని వారు చాట్‌జీపీటీలోనే తమ యాన్యువల్ రికాప్‌ కోసం నేరుగా అభ్యర్థించవచ్చు. వినియోగదారులకు తమ రోజువారీ జీవితాల్లో AI పాత్రను ఆలోచనాత్మకంగా, సరదాగా చూసే అవకాశం కల్పిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+