కొత్త సంవత్సరం మొదటి నెలలోనే జుకర్‌బర్గ్ షాక్ ఇస్తాడా ఏంటి?

మెటాలో మరో విడత భారీ లేఆఫ్స్ చోటు చేసుకోనున్నాయా? కొత్త ఏడాదిలో కూడా ఈ దిగ్గజ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఉద్యోగుల సంఖ్యను కుదించుకోబోతోందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. వార్షిక బడ్జెట్ లో 30 శాతం వరకు కోత పెట్టబోతోందీ సంస్థ. తన ఖర్చులను గణనీయంగా తగ్గించుకోబోతోంది. ఇందులో ఉద్యోగుల మీద పెట్టే వ్యయమే అధికంగా ఉన్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక వెల్లడించింది. దీనిపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

జుకర్‌బర్గ్ సారథ్యంలోని మెటా.. వచ్చే ఏడాది మెటావర్స్ విభాగానికి కేటాయించిన బడ్జెట్‌లో 30 శాతం కోత విధించాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ విభాగంలో ప్రముఖంగా మెటా హారిజన్ వరల్డ్స్, అలాగే దాని క్వెస్ట్ వర్చువల్ రియాలిటీ యూనిట్‌లు ఉన్నాయి. ఈ భారీ కోతల్లో భాగంగా జనవరి నుంచే ఉద్యోగుల తొలగింపులు ఉండవచ్చని బ్లూమ్‌బెర్గ్ అంచనా వేసింది. మెటాకు చెందిన విశ్వసనీయ వర్గాలను తన కథనానికి ఉటంకించింది.

Fresh Layoffs Reportedly Loom as Meta Slashes Metaverse Budget by 30 Percent

ఈ తాజా పరిణామాలు- గత ఏడాది జనవరిలో మెటా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, రియాలిటీ ల్యాబ్స్ అధిపతి ఆండ్రూ బోస్‌వర్త్ చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. మెటా ప్లాట్‌ఫామ్స్ బిజినెస్ అండ్ రీసెర్చ్ విభాగం రియాలిటీ ల్యాబ్స్ చరిత్రలో ఈ ఏడాది అత్యంత కీలకమైనదిగా ఉండబోతోందని అప్పట్లో ఆశాభావం వ్యక్తం చేశారాయన. దీనికి భిన్నంగా బడ్జెట్ కుదించుకోవడం అంటే కొత్త లేఆఫ్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టయిందని బ్లూమ్ బెర్గ్ అభిప్రాయపడింది.

కిందటి నెలలో జుకర్‌బర్గ్ హవాయి ఎస్టేట్‌లో మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లతో సమావేశాలు నిర్వహించారు. ఇదివరకట్లాగే అన్ని విభాగాల్లో కూడా సుమారు 10 శాతం మేర బడ్జెట్ కోతలను విధించాలని సూచించారు. ఈ కోతల్లో అధిక భాగం వర్చువల్ రియాలిటీ (VR) విభాగాన్ని ప్రభావితం చేయనున్నాయి. దీంతో పాటు హారిజన్ వరల్డ్స్ కోసం అదనపు తగ్గింపులు కూడా ప్రణాళికలో ఉన్నాయి. మెటావర్స్ కార్యకలాపాలు రియాలిటీ ల్యాబ్స్ పరిధిలోకి వస్తాయి.

బ్లూమ్‌బెర్గ్ కథనం మేరకు 2021 ప్రారంభం నుండి రియాలిటీ ల్యాబ్స్ 70 బిలియన్ డాలర్లకు పైగా నష్టాలను నమోదు చేసింది. వచ్చే ఏడాది దీన్ని రిపీట్ చేయకూడదని మెటా భావిస్తోంది. దీంతో పాటు మెటా సూపర్‌ఇంటెలిజెన్స్ ల్యాబ్ ను కూడా ఏర్పాటు చేసింది. స్కేల్ AI, గిట్‌హబ్ మాజీ సీఈఓలు అలెగ్జాండర్ వాంగ్ నాట్, ఫ్రైడ్‌మాన్ సహా OpenAI, Apple లాంటి పోటీదారుల నుండి టాప్ ఇంజినీర్లు, రీసెర్చర్లు ఇందులో పని చేస్తోన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+