హిందూ మహాసముద్రంలో Google సీక్రెట్ డేటా సెంటర్?
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సర్వీసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) కూడా ఈ రంగంలో అడుగు పెట్టింది. దాని అనుబంధ సంస్థ రిలయన్స్ ఇంటెలిజెన్స్ లిమిటెడ్, ఫేస్ బుక్ మాతృసంస్థ మెటాతో కలిసి ప్రత్యేకంగా జాయింట్ వెంచర్ ను నెలకొల్పింది. రిలయన్స్ ఎంటర్‌ప్రైజ్ ఇంటెలిజెన్స్ లిమిటెడ్ (REIL) గా దీనికి పేరు పెట్టారు. ఎంటర్‌ప్రైజ్ AI సేవలను అభివృద్ధి చేయడం, మార్కెటింగ్ పై ఈ సంస్థ దృష్టి సారిస్తుంది.
ఈ పరిణామాల మధ్య గూగుల్.. హిందూ మహాసముద్రంలో ఓ సీక్రెట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్‌ను నిర్మిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆస్ట్రేలియా సైన్యంతో ఈ సౌకర్యానికి సంబంధం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై రాయిటర్స్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీని ప్రకారం.. ఆస్ట్రేలియా సమీపంలోని క్రిస్మస్ ఐలాండ్‌లో ఈ డేటా కేంద్రాన్ని నిర్మిస్తోంది. ఆస్ట్రేలియా సైన్యంతో కుదిరిన క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందంతో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధం ఉందని అంచనా వేసింది.

హిందూ మహాసముద్రంలో గూగుల్ డేటా సెంటర్‌ను ఎందుకు నిర్మిస్తోంది? దీనికోసం క్రిస్మస్ ఐలాండ్ ను ఎందుకు ఎంచుకుంది అనే ప్రశ్నలకు తెరపడట్లేదు. రాయిటర్స్ కథనం ప్రకారం- క్రిస్మస్ ఐలాండ్‌లో ఏడు మెగావాట్ల డేటా సెంటర్‌కు అవసరమైన డీజిల్, రెన్యూవబుల్ ఎనర్జీని ఉపయోగించి దీర్ఘకాలిక ఇంధన సరఫరా ఒప్పందాన్ని ప్రతిపాదించింది. 135 చదరపు కిలోమీటర్ల ఈ ద్వీపాన్ని ఆస్ట్రేలియాలోని డార్విన్‌కు సబ్‌సీ కేబుల్ ద్వారా అనుసంధానించడానికి గూగుల్ పర్యావరణ దరఖాస్తులను సమర్పించింది.
గూగుల్ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ప్రస్తుతం బోసన్ సబ్‌సీ కేబుల్ సిస్టమ్ అందుబాటులో ఉంది. ఇది డార్విన్, క్రిస్మస్ ఐలాండ్‌లను అనుసంధానించేలా రూపుదిద్దుకుంది. సింగపూర్‌కు కూడా అదనపు కనెక్టివిటీని అందిస్తుందీ కేబుల్. గూగుల్ ప్రాజెక్ట్‌లో ఇంటర్‌లింక్ కేబుల్ వ్యవస్థ కూడా ఉంది. ఇది మెల్‌బోర్న్, పెర్త్, క్రిస్మస్ ఐలాండ్‌లను కనెక్ట్ చేస్తుంది.
గూగుల్ దీన్ని తోసిపుచ్చింది. తాము క్రిస్మస్ ఐలాండ్‌లో ఓ భారీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్‌ను నిర్మిస్తోన్నట్లు వస్తోన్న వార్తల్లో వాస్తవం లేదని తెలిపింది. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆస్ట్రేలియాతో కనెక్టివిటీని మరింత మెరగుపర్చే క్రమంలో భాగంగా సబ్‌సీ కేబుల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను డెవలప్ చేస్తోన్నామని వివరించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది. అయినప్పటికీ- డేటా సైట్ నిర్మాణంలో ఉందని రాయిటర్స్ కథనం స్పష్టం చేసింది.
-
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!!












Click it and Unblock the Notifications