ఉచితంగా AI కోర్సులు - నేర్చుకుంటే జాబ్, మంచి ప్యాకేజ్ పక్కా..!!
ప్రస్తుతం ఏఐ సునామీలా దూసుకొస్తోంది. అన్ని రంగాల్లోనూ ఏఐ ఆధారిత సేవలు విస్తరిస్తు న్నాయి. ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్ హవా కొనసాగుతోంది. ఏఐ స్కిల్స్ ఉన్న వారికి మార్కెట్ లో డిమాండ్ పెరుగుతోంది. ప్రధాన రంగాలు ఏఐ వినియోగానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీంతో పూర్తి గా ఏఐ టెక్నాలజీ సేవలుగా మారిపోతున్నాయి. దీంత, ప్రముఖ సంస్థ గుగూల్ ఏఐ కోర్సుల పైన అవగాహన కల్పిస్తోంది. ఉచితంగా పది కోర్సుల్లో ఆన్ లైన్ శిక్షణ ఇస్తోంది. వీటిని సద్వినియోగం చేసుకుంటే మంచి జాబ్ తో పాటుగా భారీ ప్యాకేజీలు దక్కే అవకాశం ఉంది.
గుగూల్ శిక్షణ
గుగూల్ దాదాపు పది ప్రాధాన్యత ఉన్న ఏఐ కోర్సుల్లో శిక్షణ ఇస్తోంది. అందులో ముఖ్యంగా జన రేటివ్ ఏఐ ఇంట్రడక్షన్ కోర్సు తో మొదలు పెడుతోంది. గూగుల్ టూల్స్‌ను వాడుకొని సొంతంగా జనరేటివ్ ఏఐ యాప్‌లను ఎలా డెవలప్ చేయాలి అనేది చెబుతున్నారు. ఆసక్తి ఉన్న వారు శ్రద్ధ పెడితే ఈ బేసిక్ ఆన్‌లైన్ కోర్సు పూర్తి కావడానికి 45 నిమిషాల సమయమే పడుతుంది. ఇక, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌ను సంక్షిప్తంగా LLM అంటారు. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ పనితీరును మెరుగుపర్చడానికి మీరు ప్రాంప్ట్ ట్యూనింగ్‌ను ఎలా ఉపయోగించచ్చు ? అనేది ఈ కోర్సులో నేర్పిస్తున్నట్లు వెల్లడించారు. వీటితో పాటుగా ఏఐ టెక్నాలజీలో రెస్పాన్సిబుల్ ఏఐ వినియోగం ఎలా ఉంటుంది..పని తీరు పైన 7 ఏఐ సూత్రాలను ఈ కోర్సులో భాగంగా నేర్పిస్తున్నారు.

భవిష్యత్ కోసం
జనరేటివ్ ఏఐ ఫండమెంటల్స్ కోర్సులో జనరేటివ్ ఏఐకి సంబంధించిన బేసిక్స్‌ను కూడా ఈ శిక్షణ లో నేర్పిస్తున్నారు. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ నేర్చుకున్నాక, స్కిల్ బ్యాడ్జ్‌ను అందిస్తారు. ఈ కోర్సు చివర్లో నిర్వహించే క్విజ్‌లో వచ్చే స్కోరును బట్టి అవగాహనా స్థాయిపై ఒక అంచనాకు రావచ్చు. ఇక..ఇమేజ్ జనరేషన్‌పై ఈ కోర్సులో స్కిల్స్ నేర్పిస్తారు. వివిధ రకాల ఇమేజ్ జనరేషన్ మోడల్స్‌ను పరిచయం చేస్తారు. అదే విధంా.. ఈ కోర్సులో మీకు ఎన్‌కోడర్-డీకోడర్ ఆర్కిటెక్చర్ గురించి బోధిస్తారు. TensorFlow అనే ఓపెన్ సోర్స్ మెషీన్ లెర్నింగ్ ప్లాట్ ఫాంలో ఎన్‌కోడర్-డీకోడర్ ఆర్కిటెక్చర్‌ను వినియోగించడంపై మెలకువలు నేర్పిస్తారు.
వీటితో పాటుగా అటెన్షన్ మెకానిజంపై కోర్సు..ట్రాన్స్‌ఫార్మర్ మోడల్, బీఈఆర్టీ మోడల్ కోర్సు.. ఇమేజ్ క్యాప్షనింగ్ మోడల్‌ల తయారీపై కోర్సు..ఇక, జనరేటివ్ ఏఐ స్టూడియో గురించి ఈ కోర్సులో నేర్పిస్తారు. చివర్లో ఎంత నేర్చుకున్నారో చెక్ చేసుకునేందుకు ఒక క్విజ్ ఉంటుంది. ఈ కోర్సులు పూర్తయ్యాక గూగుల్ క్లౌడ్ మీకు 'కంప్లీషన్ బ్యాడ్జ్'ని అందిస్తుంది. ఈ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా కోర్సు వెబ్‌సైట్‌ను సందర్శించండి. ai.google/learn-ai-skills/ లేదా grow.google/ai/ . మీరు ఈ కోర్సులన్నింటినీ ఇక్కడ నేర్చుకోవచ్చు.












Click it and Unblock the Notifications