సెల్ఫ్ డ్రైవింగ్ కారులో.. అవే కీలకం

ఇప్పుడు టెక్ ప్రపంచం మొత్తం కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చుట్టే తిరుగుతోంది. చివరికి- ఆటోమోటివ్ సెగ్మెంట్ లో సైతం ఏఐ దూసుకొచ్చేసింది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అందుబాటులోకి రావడమే దీనికి నిదర్శనం. ఊహకు కూడా అందని విధంగా డ్రైవరే అక్కర్లేని కార్లు రోడ్ల మీదికి వచ్చేస్తోన్నాయి. ఏఐ.. డ్రైవర్ రోల్ ను పోషిస్తోంది.

మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఆధారంగా పనిచేసే ఏఐ అల్గోరిథమ్స్ డ్రైవర్ సీటును ఆక్రమిస్తోన్నాయి. మనుషుల ప్రమేయం లేకుండా సెన్సార్ డేటాను అర్థం చేసుకోవడం, వస్తువులను గుర్తించడం, రూట్ ప్లాన్ రూపొందించుకోవడం, సంక్లిష్ట వాతావరణంలో కూడా కారును నావిగేట్ చేయడానికి ఈ అల్గోరిథమ్స్ ఉపయోగపడతాయి. రియల్-టైమ్ సెన్సార్ డేటా ఇందులో కీలకం.

How AI cars Work

సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు తమ పరిసరాల గురించి డేటాను సేకరించడానికి కెమెరాలు, లైడార్, రాడార్, జీపీఎస్ వంటి వివిధ రకాల సెన్సార్లను ఉపయోగిస్తాయి. ఏఐ అల్గోరిథమ్ లో కన్వల్యూషనల్ న్యూరల్ నెట్‌వర్క్‌ అనేది ఇక్కడ కీలకం. ఇతర వాహనాలు, పాదచారులు, ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్ సింబల్స్ వంటి వస్తువులను గుర్తించడానికి, వాటిని డీకోడ్ చేయడానికి సెన్సార్ డేటాను విశ్లేషిస్తాయి.

లేన్ గుర్తులు, రోడ్డు కర్వ్, స్పీడ్ బ్రేకర్లు, డివైడర్ల వంటివి గుర్తించడానికి, వాతావరణ పరిస్థితులపై ఓ అవగాహన ఏర్పరచుకోవడానికి ఈ అల్గోరిథమ్స్ సహాయపడతాయి. ముందుగానే ఇచ్చిన ఫీడ్ కు అనుగుణంగా అవి గమ్యస్థానాన్ని చేరుకుంటాయి. దీనికోసం 100 శాతం ఖచ్చితత్వంతో కూడిన రూట్ మ్యాప్ ను ఫీడ్ చేయాల్సి ఉంటుంది.

ఊహించని పరిస్థితులు ఎదురైనప్పుడు.. అంటే- సెల్ఫ్ డ్రైవింగ్ కారు వేగంగా వెళ్తోన్నప్పుడు హఠాత్తుగా ఏవైనా వస్తువులు, వాహనాలు, మనుషులు.. అడ్డుగా వచ్చినప్పుడు ఎలా వ్యవహరించాలి? అనే అంశం సైతం ముందుగానే ఫీడ్ చేస్తారు. దీనికి అనుగుణంగానే ఏఐ అల్గోరిథమ్స్ పని చేస్తాయి. కారుకు గానీ, అడ్డుగా వచ్చిన వాటికి గానీ ఎటువంటి ప్రమాదం కలగకుండా ఈ అల్గోరిథమ్స్ యాక్టివేట్ అవుతాయి.

ప్లానింగ్, ప్రిడిక్షన్ మాడ్యూల్స్ తీసుకున్న నిర్ణయాలను కారు స్టీరింగ్, యాక్సిలరేషన్, బ్రేకింగ్ సిస్టమ్‌కు అనుగుణంగా ఏఐ అల్గోరిథమ్స్ ఉంటాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ అల్గోరిథమ్స్ అనేవి ఓ మనిషి మెదడులా పని చేస్తాయన్నమాట.

సెన్సార్ల నుండి వచ్చే రియల్-టైమ్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఏఐ.. నిరంతరంంగా కారు కంట్రోల్ పారామీటర్స్ ను నిర్దేశిస్తుంది. ప్రిడిక్టివ్ అనలిటిక్స్ సహాయంతో.. సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలు రోడ్డు మీదు ఎదురయ్యే ప్రమాదాలను ముందుగానే పసిగట్టగలవు. వాటిని నివారించడానికి అవసరమైన తక్షణ చర్యలను తనకు తానుగా తీసుకోగలవు.

ప్రస్తుతం టెస్లా, గూగుల్ కు చెందిన వియామో ల్ఫ్ డ్రైవింగ్ కార్లు ప్రస్తుతం అందుబాటులో ఉంటోన్నాయి. ఈ రెండు సంస్థలు కూడా తమ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ప్రాజెక్టులను మరింత మెరుగుపర్చుకుంటోన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+