ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలో ఇక..: సూపర్ పవర్!!
ఇజ్రాయెల్ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటోంది. రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకుంటోంది. ఈ క్రమంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కళ్లు చెదిరే స్థాయిలో భారీగా పెట్టుబడులు పెట్టబోతోంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ను ప్రోత్సహించడానికి 13.2 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టడానికి అవసరమైన ప్రతిపాదనలను రూపొందించింది. దీనికి ఆ దేశ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రక్షణ వ్యవస్థతో పాటు ఇతర కీలక మంత్రిత్వ శాఖలు, రంగాల్లో ఈ మొత్తంతో ఆర్టిఫీషియల్ డేటా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను నెలకొల్పబోతోంది ఇజ్రాయెల్.

ఇన్నోవేషన్ అథారిటీ, ఆర్థికం, పరిశ్రమలు, వ్యవసాయం, ఫుడ్ సెక్యూరిటీ మంత్రిత్వ శాఖల్లో తొలి దశలో ఆర్టిఫీషియల్ డేటా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను డెవలప్ చేస్తారు. మలి దశలో ఈ కార్యక్రమం అగ్రోటెక్, ఆరోగ్యం, పర్యావరణం, వాతావరణ మార్పులు, దేశ అంతర్గత భద్రత వంటి రంగాలలో అందుబాటులో ఉండే డేటా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
దీనిపై ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డ్రోర్ బిన్ మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్నిఅందిపుచ్చుకుంటోన్నామని, ఇన్నోవేషన్, ఆటోమేషన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ డేటా స్టోరేజీ, దీనికి సంబంధించిన ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనేక రంగాల్లో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు. ఏఐ డేటాను ఉపయోగించి అధునాతన సాంకేతికతను అభివృద్ధి చేయడానికి స్టార్టప్, పరిశోధనలనుప్రోత్సహించడానికి ప్రాధాన్యత ఇస్తోన్నామని అన్నారు.












Click it and Unblock the Notifications