AI టెక్నాలజీలో ఆ ఇంజినీర్ల వైపు కంపెనీల ఎదురు చూపు..!!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఏఐ వైపు చూస్తోంది. టెక్ కంపెనీల్లో ఏఐ ప్రభావంతో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఏఐ వినియోగం పెరుగుతున్న కొద్ది అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. కొత్త అప్లికేషన్లు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా లాంగ్‌గ్రాఫ్, లాంగ్ చెయిన్ వచ్చి చేరాయి. వీటి వినియోగం తెలుసుకోవడం ద్వారా సమర్ధవంతంగా.. వేగంగా ఏఐతో పనిచేసే అవకాశం ఏర్పడుతుంది. వీటిల్లో నైపుణ్యం ఉన్న వారి వైపు కంపెనీలు చూస్తున్నాయి.
ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్ - సాఫ్ట్ వేర్ డెవపల్ మెంట్ లో ప్రస్తుతం లాంగ్ చెయిన్, లాంగ్ గ్రాఫ్ టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తోంది. కొత్తగా ఏఐలో అడుగు పెట్టాలనుకునేవారు ఈ టెక్నాలజీ నేర్చు కోవడం అవసరంగా మారుతోంది. ఇవి ఆర్టిఫిషియల్ ఏజెంట్స్‌ను తయారుచేయడంలో కీలకంగా మారుతున్నాయి. ఏఐ ఉత్పత్తుల తయారీని ఇవి మరింత సులభతరం చేస్తున్నాయి. దీంతో.. ఈ తరహా టెక్నాలజీ తెలిసి వారికి ఉద్యోగాలు సులభంగా దొరుకుతున్నాయి. ఈ టెక్నాలజీ ఆధారిత ఉద్యోగాల్లో ఏఐ ఏజెంట్స్‌ను అభివృద్ధి చేయడం, జెనరేటివ్ ఏఐ అనువర్తనాలు తయారు చేయడం.. ఎలా పని చేస్తున్నాయో పర్యవేక్షించడం, లార్జ్ లాంగ్వేజ్ మాడ్యూల్స్‌తో పనిచేయడం వంటి విధులు ఉంటాయి.

కాగా, ఎంఎన్సీ కంపెనీలు ఇప్పటికే లాంగ్‌చెయిన్ అండ్ లాంగ్‌గ్రాఫ్ తెలిసిన ఏఐ ఇంజినీర్లను కోరుకుంటున్నాయి. ఏజెంటిక్ వర్క్ ఫ్లోలను అభివృద్ధి చేయడం, ఏఐ ఆధారిత సిస్టమ్స్, ఎల్‌ఎల్‌ఎమ్స్‌ను ఇంటిగ్రేట్ చేయడం వంటి పనులు చేయగల నిపుణులకు ప్రాధాన్యత పెరిగింది. డేటా సైంటిస్టులు పైతాన్, జావాస్క్రిప్ట్, డెవలపర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, టైప్‌స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో పట్టు ఉన్నవారు ఆయా లాంగ్వేజెస్‌లో ఉన్న లాంగ్‌చెయిన్ ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నారు. లాంగ్‌చెయిన్ ఒక లంకె మాదిరి చేయదగిన పనులకు సులభంగా ఉపయోగంగా ఉంటుంది. రిట్రైవల్ ఫ్లో, లీనియర్ చెయిన్స్ ఉపయోగించి ఇంటర్‌ఫేస్ అందిస్తుంది. స్పష్టంగా, నేరుగా ఉండే టాస్కులకు ఇది చాలా బాగుంటుంది. లాంగ్‌చెయిన్ ఒకదానికి ఒకటి కనెక్టివిటీగా, తేలికగా ఉండే టాస్కులకు ఉపయోగ పడితే లాంగ్‌గ్రాఫ్ గజిబిజి పనులకు ఉపయోగపడుతుంది. దీంతో, ఈ తరహా నైపుణ్యాలు ఉన్న వారికి ఇప్పుడు మంచి డిమాండ్ కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications