18 నెలల్లో ఈ వైట్ కాలర్ జాబ్స్ అన్నీ..! మైక్రోసాఫ్ట్ ఏఐ ఛీఫ్ వార్నింగ్..!

కృత్రిమ మేథ దూకుడు కారణంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఆవిరైపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత స్ధాయిలో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. వీటి స్ధానాన్ని ఏఐ వేగంగా భర్తీ చేసేస్తోంది. అయితే ఇప్పుడు టాప్ వైట్ కాలర్ జాబ్స్ సైతం ఏఐ దెబ్బకు ఊడిపోవడం ఖాయమని, దీనికి కేవలం 18 నెలలే ఉందని మైక్రోసాఫ్ట్ ఏఐ (Microsoft AI) సీఈవో ముస్తఫా సులేమాన్ హెచ్చరించారు.

ఈ ఏడాది ఆరంభంలోనే వచ్చే 12-18 నెలల్లో కృత్రిమ మేధస్సు (AI) ద్వారా అనేక వైట్-కాలర్ ఉద్యోగాలు పూర్తిగా ఆటోమేట్ అవుతాయని సులేమాన్ తేల్చిచెప్పేశారు. న్యాయవాదులు, అకౌంటెంట్లు, ప్రాజెక్ట్ మేనేజర్లు, మార్కెటింగ్ నిపుణులతో సహా పలు ఉద్యోగాలకు సమీప భవిష్యత్తులో గణనీయమైన ఆటోమేషన్ ఎదురుకావచ్చని సులేమాన్ పేర్కొన్నారు. కోడింగ్, డేటా విశ్లేషణ, వర్క్‌ఫ్లో ఆటోమేషన్ చేయగల ఏఐ సాధనాల్లో టెక్ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. జనరేటివ్ ఏఐని రోజువారీ కార్యకలాపాల్లో అనుసంధానించేందుకు వ్యాపారాలు ప్రయోగాలు చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Microsoft AI CEO Mustafa Suleyman s Stark Warning Lawyers Accountants and Managers Have 18 Months Before AI Takes Over

అయితే, ఏఐ ఉద్యోగాలను పూర్తిగా తొలగించకుండా, పనిచేసే విధానాన్ని మారుస్తుందని సులేమాన్ అభిప్రాయపడ్డారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ రంగంలో ఉద్యోగ బాధ్యతలు ఎలా మారుతున్నాయో ఆయన ఉదాహరణగా చూపారు. చాలా మంది డెవలపర్‌లు AI-సహాయక కోడింగ్‌పై ఆధారపడుతూ, వారి పాత్రను సమీక్ష, డీబగ్గింగ్, ఉన్నత స్థాయి నిర్ణయాల వైపు మారుస్తున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్‌లో చాలా మంది "మెటా" స్థాయిలో (కంపెనీ మెటా కాదు) పనిచేస్తున్నారని సులేమాన్ పేర్కొన్నారు. వారి పాత్ర వ్యూహాత్మకంగా ఆలోచించడం, పర్యవేక్షించడమే. వైద్య రంగాన్ని పోల్చుతూ, ఏఐ వ్యవస్థలు రోగ నిర్ధారణ చేస్తే, వైద్యులు చికిత్సతో పాటు భావోద్వేగ మద్దతు ఇవ్వడంపై దృష్టి సారిస్తారని చెప్పారు. సరైన జాగ్రత్తలు లేకుండా AIతో ముందుకు వెళ్లడం సరికాదని సులేమాన్ స్పష్టం చేశారు. మానవ లక్ష్యాలకు అనుగుణంగా ఉండే వ్యవస్థలకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన నొక్కి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+