మనిషి మెదడుని తినేస్తున్న చాట్ జీపీటీ.. సంచలన రిపోర్టు వెలుగులోకి..?
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వాడకం పెరిగిపోయింది. మానవుడు పరిష్కరించలేని అనేక సమస్యలకు ఏఐ సమాధానం ఇస్తోంది. దీంతో ఏఐ టూల్స్ అయిన చాట్ జీపీటీ, గ్రోక్, జెమినీ, ఓపెన్ ఏఐ లను ప్రజలు తమ నిత్య కృత్యాల్లో భాగంగా మార్చుకున్నారు. ఈ క్రమంలో ఓ సంచలన రిపోర్టు తాజాగా బయటకు వచ్చింది.
ప్రముఖ ఏఐ టూల్ చాట్ జీపీటీపై ప్రఖ్యాత విశ్వవిద్యాలయం మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జరిపిన పరిశోధనల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మానవ మెదడుపై చాట్ జీపీటీ ఎలాంటి ప్రభావం కనబరుస్తుందన్న దానిపై రీసెర్చ్ చేశారు. చాట్ జీపీటీ యూజర్స్ సమస్యలను 60శాతం వేగంగా పరిష్కరిస్తున్నట్లు గుర్తించారు. అయితే వారి మేధా శక్తి, ఆలోచించే శక్తి మాత్రం 32 శాతానికి పడిపోయినట్లు తేల్చారు.
మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు.. మొత్తం 54 మందిపై పరిశోధనలు జరిపారు. 54 మందిపై ఈఈజీ బ్రెయిన్ స్కానింగ్ నిర్వహించారు. వీళ్లంతా 18 నుంచి 39 ఏళ్ల మధ్య వారు. దాదాపు 4నెలలు వీరిపై పరిశోధనలు చేశారు. రీసెర్చ్ లో భాగంగా ఆల్ఫా కిరణాలు, బీటా కిరణాలు, న్యూరో వ్యవస్థపై పరిశోధనలు నిర్వహించారు. అయితే చాట్ జీపీటీ వినియోగదారులకు మేధా శక్తి లోపించినట్లు తేలిందని వివరించారు. చాట్ జీపీటీ వినియోగదారుల న్యూరో వ్యవస్థ, భాషా సామర్థ్యం, వ్యవహరణలో మార్పులు గమనించినట్లు పేర్కొన్నారు.

చాట్ జీపీటీ వినియోగంతో అభివృద్ది చెందుతున్న మెదడు ప్రమాదంలో పడుతుందని ఈ పరిశోధనలను తన జర్నల్ లో వివరించిన నటాలియా కోస్మిన్ పేర్కొన్నారు. ఫలితాలు షాకింగ్ గా ఉన్నట్లు తెలిపారు. ఏఐ మనకు ఉపయోగ పడటం కాదని.. హరించి వేస్తోందని అభిప్రాయ పడ్డారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కీలక విషయాలను వెల్లడించారు.
BREAKING: MIT just completed the first brain scan study of ChatGPT users & the results are terrifying.
— Alex Vacca (@itsalexvacca) June 18, 2025
Turns out, AI isn't making us more productive. It's making us cognitively bankrupt.
Here's what 4 months of data revealed:
(hint: we've been measuring productivity all wrong) pic.twitter.com/OcHy9197tk
చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ కారణంగా మనిషి ఆలోచనా శక్తిని కోల్పోతున్నాడని.. కొత్తగా ఆవిష్కరించే గుణాన్ని కోల్పోతున్నాడని.. అన్నీ ఏఐ చేయడంతో మనిషి మెదడు యాక్టివ్ నెస్ తగ్గిపోతుందని.. ఓ రకంగా ఇది మనిషి మెదడుని తినేస్తుందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications