దిగ్గజ సంస్థల్లో లక్ష టెక్ ఉద్యోగాల కోత - AI నైపుణ్యం ఉంటే సేఫ్..!!
టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. ఏఐ వినియోగం పెరగటంతో పాటుగా గ్లోబల్ మార్కెట్ లో వస్తున్న మార్పులతో ఈ లే ఆఫ్స్ కొనసాగుతున్నాయి. దిగ్గజ సంస్థలు సైతం ఉద్యోగు ల సంఖ్య కుదిరిస్తున్నాయి. ఈ ఏడాది లో ఇప్పటి వరకు ప్రధాన కంపెనీలతో సహా పలు సంస్థలు ఏకంగా లక్ష మంది ఉద్యోగులను ఇంటికి పంపారు. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్ వినియోగం. రానున్న కాలంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
ఉద్యోగుల కోత
ఏఐ వినియోగంతో పాటుగా అనేక కారణాలతో మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ లాంటి దిగ్గజ కంపెనీ లు విడతల వారీగా లేఆఫ్స్ అమలు చేస్తున్నాయి. దిగ్గజ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ తాజాగా వేలాది మందిపై వేటు వేసింది. ప్రధానంగా Xbox, గేమింగ్ యూనిట్లలో 9,100 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు. మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 4 శాతానికి తక్కువ కాకుండా లే ఆఫ్స్ అమలు చేయాలని మైక్రోసాఫ్ట్ నిర్ణయించింది. ఈ తొలగింపులు Xbox, గేమింగ్ విభాగాల్లో ఉండ నున్నాయి. గత 18 నెలల కాలంలో మైక్రోసాఫ్ట్ చేపట్టనున్న నాలుగో అతిపెద్ద ఉద్యోగాల కోత ఇదేనని చెబుతున్నారు. మరోవైపు, చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 20 శాతం వరకు కోత విధించేందుకు సిద్ధమవుతోంది.

వరుసగా తొలిగింపు
ఈ నెలలో ఈ తొలగింపులు ఉండనున్నట్లు తెలిసింది. చిప్ డిజైన్, క్లౌడ్ ఆర్కిటెక్చర్, ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు లేఆఫ్స్‌కు ప్రభావితం కానున్నారు. అమెజాన్, గూగుల్, మెటా వంటి ఇతర అగ్రశ్రేణి ఐటీ కంపెనీలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. అమెజాన్ తన బుక్స్, కిండిల్ విభాగాలతో పాటు పలు ఇతర టీమ్‌లలో వందమంది వరకూ ఉద్యోగులను తగ్గించనున్నట్లు ఇప్పటికే ప్రకటన చేసింది. ఖర్చు తగ్గింపు కారణంతో దాదాపు 14 వేల మందిని తెలిగించాలని ఆలోచన చేస్తోంది. ఇక, మరో ప్రముఖ టెక్ దిగ్గజం ఐబీఎమ్ కూడా దాదాపు 8 వేల మంది ఉద్యోగులపై వేటు వేసిన ట్లు తెలిసింది. వారిలో ఎక్కువ భాగం హెచ్‌ఆర్ విభాగం నుంచే ఉన్నట్లు తెలిసింది. హెచ్ఆర్ విభాగంలో ఏఐ వినియోగంతో వీరి పైన వేటు పడింది.
ఏఐ నైపుణ్యం ఉంటే
ఇన్ఫోసిస్ కూడా అంతర్గత పరీక్షలలో ఉత్తీర్ణత సాధించలేకపోయిన 240 మంది ఎంట్రీ-లెవల్ ఉద్యోగులను తొలగించింది. ఇక ఓలా ఎలక్ట్రిక్ కూడా ఐదు నెలల్లో దాదాపు వెయ్యి మందిపై వేటు వేసింది. హెచ్‌పీలో 2 వేల మందిని, సేల్స్‌ఫోర్స్ వెయ్యి మంది ఉద్యోగులపై వేటు వేశాయి. బ్లూ ఆరిజన్ ఇంజినీరింగ్ విభాగంలో వెయ్యి మందిని తొలగించింది. సిమెన్స్ 5,600 మందిపై వేటు వేసింది. ఇటు ఇలా టెక్ సంస్థలు ఉద్యోగులను తెలిగిస్తున్నా.. ఏఐ నైపుణ్యం ఉన్న వారికి మాత్రం ఇబ్బంది ఉండటం లేదు. చాలా కంపెనీలు ఏఐ, ఆటోమేషన్, మెషిన్ లెర్నింగ్ ఆధారంగా తమ కార్యకలాపాల పునర్‌వ్యవస్థీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీంతో ఏఐ ఆధారిత ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతోంది.












Click it and Unblock the Notifications