జెన్ జీ ఎంట్రీతో దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. రైతుల డిమాండ్స్ కు గ్రీన్ సిగ్నల్

మధ్య ప్రదేశ్ లోని రైతులు కనీస మద్దతు ధర, సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కారు. మూంగ్(పెసలు) పంటను 100 శాతం ప్రభుత్వం కొనుగోలు చేయాలని చేపట్టిన నిరసలను ఎట్టకేలకు విరమించారు. ఈ ఉద్యమంలో జెన్ జీ యూత్ పాల్గొనడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయన్న ఆందోళనల నేపథ్యంలో మధ్య ప్రదేశ్ ప్రభుత్వం రైతుల డిమాండ్స్ ను అంగీకరించింది.

అర్హులైన రైతుల నుంచి కొనుగోలు చేసే పెసర పంట పరిమితిని 60 శాతానికి పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే కొనుగోళ్ల గడువును పొడిగించేందుకు, ఎరువుల పంపిణీలో అమల్లో ఉన్న ఈ- టోకెన్ వ్యవస్థను నిలిపివేసేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. సంయుక్త కిసాన్‌ ‌మోర్చా (ఎస్‌‌ కేఎం)తో పాటు పలు రైతు సంఘాల నాయకులతో ప్రభుత్వ యంత్రాంగం సెక్రటేరియట్ లో చర్చలు జరిపింది. చర్చల అనంతరం రైతుల డిమాండ్స్ ను అంగీకరిస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు.

అంతకుముందు వేలాదిమంది నిరసనకారులు, రైతులు మధ్య ప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ అధికారిక నివాసం వైపు దూసుకొచ్చారు. అంతకుముందు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారిక నివాసం ముందు కూడా ధర్నా చేపట్టారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అయిదల్ సింగ్ కాన్ సనా మాట్లాడుతూ.. ఈ టోకెన్ వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యవస్థను సమగ్రంగా అధ్యయనం చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని అన్నారు. అలాగే ఎరువులు తగినంతగా అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు.

Farmers Madhya Pradesh demand MSP the resolution their grievances They finally called off protests

అయితే గత కొద్ది రోజులుగా రైతు ఆందోళనలు తీవ్రతరం అయ్యాయి. సంయుక్తా కిసాన్ మోర్చాతో పాటు 18 రైతు సంఘాలు రాష్ట్రంలోని ప్రధాన రహదారుల్ని బ్లాక్ చేశారు. ఈ క్రమంలో జూలై 28న ప్రభుత్వం- రైతు సంఘాల నాయకుల మధ్య జరిగిన తొలి దశ చర్చలు విఫలం అయ్యాయి. అలాగే అనేకమంది జెన్ జీ మద్దతుదారులు రైతు ఉద్యమం వద్దకు వచ్చి తమ మద్దతును ప్రకటించారు. ఇక రైతుల తీవ్ర నిరసనలు, ఆందోళనల నేపథ్యంలో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ టికాయిత్ తో దిల్లీలో భేటీ అయ్యారు. రైతులు, విద్యార్థులు, యువకుల కోసం ఓ జాయింట్ వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+