ఏఐ, డీప్ ఫేక్ వీడియోలకు షాక్-కేంద్రం తాజా రూల్స్-3 గంటల్లో..!
దేశంలో అంతకంతకూ ఎక్కువవుతున్న ఏఐ(AI), డీప్ ఫేక్ వీడియోలకు కేంద్రం చెక్ పెట్టబోతోంది. ఈ మేరకు అభ్యంతరాలు ఉన్న ఏఐ, డీప్ ఫేక్ కంటెంట్ విషయంలో కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. ఈ మేరకు ఇవాళ కీలక ప్రకటన చేసింది. దేశంలో ఫేక్, ఏఐ కంటెంట్ పెరిగిపోతున్న నేపథ్యంలో ఐటీ రూల్స్ లో సవరణలు చేసిన కేంద్రం.. ఇలాంటి కంటెంట్ ను తయారు చేసే వారికి, వాడుతున్న వారికి షాకులివ్వబోతోంది.
దేశంలో ఏఐ ద్వారా తయారు చేసిన వీడియోలు,, డీప్ ఫేక్ వీడియోలపై కఠినంగా వ్యవహరించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ లలో పోస్ట్ చేసిన అభ్యంతరకరమైన కంటెంట్ ను 3 గంటల్లోపు తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఏఐ-తయారీ కంటెంట్‌ను లేబుల్ చేయడాన్ని తప్పనిసరి చేస్తోంది. అంటే ఏఐ, డీప్ ఫేక్ ద్వారా వీడియో తయారు చేస్తే ఆ మేరకు వీడియోపై ఆ లేబుల్ ఉండాలి.

తాజాగా సవరించిన ఐటీ నిబంధనల ప్రకారం ఏఐ టూల్స్ ను వాడి సృష్టించిన ఏదైనా కంటెంట్ స్పష్టంగా, ప్రముఖంగా లేబుల్ చేస్తేనే పోస్ట్ అయ్యేలా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లు కట్టడి చేయాల్సి ఉంటుంది. అలాగే యూజ్లు కూడా తాము అప్‌లోడ్ చేసే కంటెంట్ ఏఐని ఉపయోగించి రూపొందించబడిందా లేదా మార్చబడిందా అనేది చెప్పాల్సి ఉంటుంది. చట్టవిరుద్ధమైన లేదా హానికరమైన కంటెంట్ ను మూడు గంటల్లోపు తొలగించాలి. ఏఐ తయారీ లేదా మార్ఫింగ్ చేసిన వీడియోలు చూసే వారికి కచ్చితంగా తెలిసేలా చేయాలి. ఇందులో తేడా వస్తే ఆయో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ బాధ్యత వహించాలి.












Click it and Unblock the Notifications