NHAI సంచలనం- హైవేలపై ఇక..!!

ఇప్పుడు టెక్ ప్రపంచం మొత్తం కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చుట్టే తిరుగుతోంది. చివరికి- ఆటోమోటివ్ సెగ్మెంట్ లో సైతం ఏఐ దూసుకొచ్చేసింది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అందుబాటులోకి రావడమే దీనికి నిదర్శనం. ఊహకు కూడా అందని విధంగా డ్రైవరే అక్కర్లేని కార్లు రోడ్ల మీదికి వచ్చేస్తోన్నాయి. ఏఐ.. డ్రైవర్ రోల్ ను పోషిస్తోంది.

మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఆధారంగా పనిచేసే ఏఐ అల్గోరిథమ్స్ డ్రైవర్ సీటును ఆక్రమిస్తోన్నాయి. మనుషుల ప్రమేయం లేకుండా సెన్సార్ డేటాను అర్థం చేసుకోవడం, వస్తువులను గుర్తించడం, రూట్ ప్లాన్ రూపొందించుకోవడం, సంక్లిష్ట వాతావరణంలో కూడా కారును నావిగేట్ చేయడానికి ఈ అల్గోరిథమ్స్ ఉపయోగపడతాయి. రియల్-టైమ్ సెన్సార్ డేటా ఇందులో కీలకం.

NHAI introduce India s first AI-Powered Smart Traffic System on Dwarka Expressway

ఇప్పుడు ఇది మరిం విస్తరించింది. జాతీయ రహదారులపై వాహనాల రాకపోకల్లోనూ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అడుగు పెట్టింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏఐ ఆధారిత స్మార్ట్ ట్రాఫిక్ సిస్టమ్ ను ద్వారకా ఎక్స్ ప్రెస్ వేపై ప్రవేశపెట్టింది జాతీయ రహదారుల సంస్థ (NHAI).

2023లో ఎన్ హెచ్ఏఐ రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ స్మార్ట్ ట్రాఫిక్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రాఫిక్ నిర్వహణ, రహదారి భద్రతలో ఇదొక విప్లవాత్మకంగా అభివర్ణించింది. వాహనాల రద్దీ క్రమబద్దీకరించడం, ప్రమాదాలను నివారించడంలో ఓ ముందడుగు పడిందని ఎన్ హెచ్ఏఐ పేర్కొంది.

ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (IHMCL) ఈ ఏఐ ఆధారిత ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ద్వారకా ఎక్స్ ప్రెస్ వేపై తొలిదశలో మొత్తం 56.46 కిలోమీటర్ల వరకు మేర ఇది కవర్ అవుతుంది. క్రమంగా మిగిలిన జాతీయ రహదారులకు దీన్ని విస్తరించే అవకాశం ఉంది.

రియల్ టైమ్ డేటా, ఆటోమేటెడ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ద్వారా ప్రమాదాలను తగ్గించి, వాహనాల రాకపోకలను మరింత మెరుగుపరిచే సామర్థ్యం ఈ టెక్నాలజీకి ఉందని ఎన్ హెచ్ఏఐ తెలిపింది. రోడ్డు ప్రమాదాలను సగానికి పైగా తగ్గించడానికి కేరళ ప్రభుత్వం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలను ఉపయోగించచడానికి చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.

ఇదే తరహాలో ఢిల్లీ ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ITMS) ట్రాఫిక్ ఉల్లంఘనలను పర్యవేక్షించడానికి 3డీ రాడార్ ఆధారిత కెమెరాలను ఉపయోగిస్తోంది. ఇది ప్రజలకు మరింత భద్రత కల్పించడానికి, ప్రమాదాలను నివారించడానికి ఈ అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగపడుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+