AI ద్వారా ఇబ్బడి ముబ్బడిగా కొత్త జాబ్స్: 4 మిలియన్లకు తక్కువ కాకుండా..!!
ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తోంది. దీన్ని అడాప్ట్ చేసుకోవడం వల్ల.. టీసీఎస్, మెటా, యాక్సెంచర్, విప్రో వంటి కొమ్ములు తిరిగిన కంపెనీలు సైతం లేఆఫ్స్ బాట పట్టాయి. వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. ఈ పరంపర ఇంకా కొనసాగుతూనే వస్తోంది. మున్ముందు మరింత తీవ్రతరం అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. మానవ వనరుల ద్వారా కొనసాగించాల్సిన పనులను ఏఐకి అప్పగిస్తోన్నాయి.
ఉద్యోగాలన్నింటినీ కూడా ఏఐ ఆక్రమించుకోవచ్చనే భయాందోళనలు వ్యక్తమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో నీతి ఆయోగ్.. శుభవార్త వినిపించింది. వచ్చే అయిదు సంవత్సరాల్లో ఆర్టిఫీషియల్ ఇంటెజెన్స్ ద్వారా 40 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని అంచనా వేసింది. దీన్ని అందిపుచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఏఐ టాలెంట్ మిషన్ ను ప్రారంభించాల్సిన అవసరం ఉందని సూచించింది.

ఏఐ వల్ల సంభవిస్తోన్న నష్టాలను పట్ల నీతి ఆయోగ్ ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో 245 బిలియన్ డాలర్ల విలువైన టెక్నాలజీ, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ రంగాలపై ఏఐ దుష్ప్రభావం పడుతోందని, తక్షణ నివారణ చర్యలు తీసుకోకపోతే, క్వాలిటీ అస్యూరెన్స్ ఇంజినీర్లు, సపోర్ట్ ఏజెంట్ల వంటి ఉద్యోగాలు త్వరలో కనుమరుగయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు రోడ్ మ్యాప్ ఫర్ జాబ్ క్రియేషన్ ఇన్ ఉద్యోగాల కల్పనకు రోడ్‌మ్యాప్' అనే నివేదికను తాజాగా రూపొందించింది.
స్కిల్ డెవలప్మెంట్, రీ- స్కిల్, ఇన్నోవేషన్స్ వంటి అంశాలపై దృష్టి సారించడం ద్వారా ఎథికల్ AI స్పెషలిస్టులు, AI ట్రైనర్లు, సెంటిమెంట్ ఎనలిస్టులు, AI డెవలపర్స్ వంటి ఇంజినీరింగ్, టెక్ సెగ్మెంట్లకు సంబంధించిన ఉద్యోగాలకు భారత్ హబ్ గా మారుతుందని నీతి ఆయోగ్ పేర్కొంది. దీనికోసం మూడంచెల వ్యూహాన్ని అనుసరించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
1. AIని ప్రాథమిక విద్యలో చేర్చడం.. 2. టెక్నాలజీ, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ నిపుణుల కోసం జాతీయస్థాయిలో ఓ రీ- స్కిల్ ఇంజిన్‌ను ఏర్పాటు చేయడం.. 3. AI టాలెంట్ కు భారత్ ను గమ్యస్థానంగా మార్చడం. ఈ మూడింటినీ అమలు చేయడం ద్వారా వచ్చే అయిదేళ్లల్లో ఈ రంగంలో చోటు చేసుకుంటూ వస్తోన్న అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని, నాలుగు మిలియన్లకు పైగా ఉద్యోగాలను కల్పించినట్టవుతుందని తెలిపింది.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications