వార్నీ.. పేటీఎంలో కూడా లేఆఫ్స్?

Paytm layoffs 2025: ప్రముఖ డిజిటల్ పేమెంట్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్‌‌‌ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను అడాప్ట్ చేసుకుంది. డిజిటల్ పేమెంట్స్ ను మరింత సరళీకరించడంలో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ క్రమంలో లేఆఫ్స్ ప్రకటించాలని భావిస్తోందా సంస్థ యాజమాన్యం.

ఈ విషయాన్ని వన్97 కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విజయ్ శేఖర్ శర్మ వెల్లడించారు. డిజిటల్ పేమెంట్ ప్లాట్ ఫామ్ లల్లో AI- ఆధారిత సేవలను అందించే మొదటి సంస్థ తమదేనని అన్నారు. యూజర్లకు మరింత మెరుగైన సేవలను అందించడంలో ముందుంటామని పునరుద్ఘాటించారు.

Paytm is adopts AI and likely to announce Lay offs

ఈ మేరకు వాటాదారులకు ఆయన లేఖ రాశారు. AI-ఆధారిత స్టాక్ పేమెంట్స్ లక్షలాది మంది వ్యాపారులకు అందుబాటులోకి రాబోతోందని తెలిపారు. కస్టమర్లకు సేవలు అందించే విధానాన్ని పునర్నిర్వచిస్తున్నందుకు గర్విస్తున్నామని అన్నారు. ఇకపై తమ సంస్థకు చెందిన ప్రతి ప్రొడక్ట్ లోప్రతి ప్రక్రియలో AI- ఆధారిత సేవలు ఉండబోతోన్నాయని విజయ్ శేఖర్ శర్మ పేర్కొన్నారు.

పేటీఎం తన ప్రధాన చెల్లింపుల కార్యకలాపాలపై దృష్టి సారించడం, వ్యాపార ప్రాథమిక అంశాలను నిరంతరం బలోపేతం చేసుకోవడం వల్ల నిలకడగా వృద్ధి సాధించవచ్చని, లాభదాయకతకు బాటలు పడతాయని అంచనా వేస్తోన్నట్లు ఆయన స్పష్టం చేశారు. దేశీయ ఫిన్‌టెక్ రంగంలో AIని ముందుగా అడాప్ట్ చేసుకున్న సంస్థగా పేటీఎం నిలిచిందని చెప్పారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో పేటీఎం 123 కోట్ల నికర ఆదాయాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదేన కాలంతో పోల్చుకుంటే దాదాపుగా 4.5 శాతం మేర సంస్థ లాభాలను సాధించింది. మార్కెట్ వర్గాల అంచనాలకు మించిన ఆదాయం ఇది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్-పాజిటివ్ గా ఉండటం ఇన్వెస్టర్లలో ఆశలు నింపింది.

ఇదే విషయాన్ని విజయ్ శేఖర్ శర్మ.. వాటాదారులకు రాసిన లేఖలో పొందుపరిచారు. లాభాల్లో సరికొత్త మైలురాయిని అందుకున్నామని, ఫలితంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సేవలను వినియోగదారులకు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు చెప్పారు. క్రమశిక్షణ, నమ్మకం, సరికొత్త ఆవిష్కరణలతో సంస్థను లాభాల బాట పట్టించామని. ఈ విషయంలో ఎంతో శ్రమించారని అన్నారు.

డిజిటల్ పేమెంట్స్, క్యాష్ డిపాజిట్స్, పేమెంట్ బ్యాంకింగ్ రంగంలో వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని విజయ్ శేఖర్ శర్మ అన్నారు. పేటీఎం భాగస్వామ్య బ్యాంకులు, సాంకేతిక నైపుణ్యంతో యూజర్ బేస్డ్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తామని మామీ ఇచ్చారు.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను అడాప్ట్ చేసుకున్న నేపథ్యంలో వన్97 కమ్యూనికేషన్స్ యాజమాన్యం లేఆఫ్స్ ప్రకటించవచ్చనే అంచనాలు మార్కెట్ వర్గాల్లో వ్యక్తమౌతోెన్నాయి. సేల్స్, మానవ వనరులు వంటి కొన్ని విభాగాల్లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవచ్చని తెలుస్తోంది. 6,400 మంది ఉద్యోగులను తొలగించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+