ఏపీలో వారి ఖాతాల్లో రూ.25వేలు..ఇంకా రెండురోజులే అప్లైకి అవకాశం.. త్వరపడండి!

ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం అన్ని రంగాల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పని చేస్తుంది. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రాష్ట్రంలో ప్రజలకు బాసటగా నిలుస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా నేతన్న సేవలో పథకాన్ని అమలు చేయబోతోంది. ఈనెల 7వ తేదీన నేతన్న సేవలో పథకం ద్వారా అర్హులైన చేనేత కార్మికులకు వారి ఖాతాలో 25 వేల రూపాయలను జమ చేయమన్నారు.

అర్హులైన చేనేత కార్మికులు అప్పటిలోగా దరఖాస్తు చేసుకోవాలన్నమంత్రి సవిత

ఈ క్రమంలో రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత అర్హులైన చేనేత కార్మికులు ఈనెల 5వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గడువు ముగిసే లోపు ప్రతి అర్హుడు దరఖాస్తు చేసుకుని ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సవిత విజ్ఞప్తి చేశారు.

Nethanna Sevalo scheme AP Handlooms Minister Savitha urges eligible weavers to apply before August 5 evening

నేతన్న సేవలో పథకం అమలుపై అధికారులకు కీలక సూచనలు

ఈరోజు చేనేత జౌళి శాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించి పథకం అమలు తీరుపైన వారితో మాట్లాడారు. దరఖాస్తుల స్వీకరణ, అర్హుల ఎంపిక, కార్యాచరణ వంటి అంశాలపై అధికారులతో చర్చించి కీలక సూచనలు చేశారు. నేతన్న సేవలో పథకం అమలులో ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి లోపాలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ఆ రోజే అర్హులైన నేతన్నల ఖాతాల్లో డబ్బులు జమ

అంతర్జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈనెల ఏడవ తేదీన గుంటూరు జిల్లా చీరాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభిస్తారని అదే రోజు దరఖాస్తు చేసుకున్న అర్హులైన, నేతన్నల ఖాతాలో నగదు జమ అవుతుందని మంత్రి సవిత పేర్కొన్నారు. ఈ స్కీమ్ ద్వారా ప్రతి సంవత్సరం చేనేత కార్మికులకు 25 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్టు తెలిపారు.

చేనేత కుటుంబాలను ఆర్ధికంగా బలోపేతం చేయటం కోసమే నేతన్న సేవలో స్కీమ్

చేనేత కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి, చేనేత వృత్తిని ప్రోత్సహించడానికి, కార్మికులు గౌరవప్రదమైన జీవనాన్ని సాగించడానికి ప్రభుత్వం సంకల్పించి ఈ పథకాన్ని అమలు చేస్తుందన్నారు. ఎన్నికల హామీలలో ఈ పథకం లేకపోయినా చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని, కూటమి ప్రభుత్వం దీనిని అమలు చేస్తున్నట్టు మంత్రి సవిత పేర్కొన్నారు.

టీటీడీ చేసిన ఆ తీర్మానం వెనుక భారీ అవినీతి కుట్ర.. దానికోసం లోకేష్ ఒత్తిడి!
టీటీడీ చేసిన ఆ తీర్మానం వెనుక భారీ అవినీతి కుట్ర.. దానికోసం లోకేష్ ఒత్తిడి!

అర్హుల ఎంపిక నుండి ఆర్థిక సహాయం అందించే వరకు ఇబ్బంది ఉండకూడదన్న మంత్రి

ఈ పథకాన్ని అమలు చేయడంలో ఎటువంటి ఆరోపణలకు, విమర్శలకు తావు లేకుండా చూడాలన్నారు. అర్హుల ఎంపిక నుండి ఆర్థిక సహాయం అందించే వరకు ప్రతి దశను పకడ్బందీగా నిర్వహించాలని, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని మంత్రి స్పష్టం చేశారు. అర్హత ఉన్న చేనేత కార్మికులు దరఖాస్తు చివరి తేదీని మరిచిపోవద్దని ఆగస్టు 5వ తేదీ సాయంత్రం 5 గంటల లోపే దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+