ట్రంప్ ఆజ్ఞను ధిక్కరించిన సైన్యం.. AI తో ఇరాన్‌పై దాడి

వైట్ హౌస్ నుండి వెలువడిన ఒక ఆదేశం.. పెంటగాన్ గదుల్లో జరిగిన ఒక ధిక్కారం.. యుద్ధ క్షేత్రంలో ఒక అదృశ్య శక్తి! అమెరికా రక్షణ వ్యవస్థలో ప్రస్తుతం నెలకొన్న హై-డ్రామా సగటు హాలీవుడ్ థ్రిల్లర్ నెయిల్ బైటింగ్ క్లైమాక్స్ ను తలపిస్తోంది. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అల్టిమేటం జారీ చేసినా, సైన్యం మాత్రం తన దారి తనదే అంటూ ముందుకు సాగడం అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది.

మార్చి 1, 2026 నాటి తెల్లవారుజామున ఒక సంచలన వార్త వాల్ స్ట్రీట్ జర్నల్ ద్వారా బయటపడింది. ఆంత్రోపిక్ కంపెనీకి చెందిన 'క్లాడ్ AI' (Claude AI) వినియోగాన్ని తక్షణమే నిలిపివేయాలని అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించిన కొద్ది గంటలకే, ఇరాన్‌పై జరిగిన అత్యంత కీలకమైన వైమానిక దాడిలో అమెరికా సైన్యం అదే AIని ఉపయోగించింది. దేశాధ్యక్షుడి ఆదేశాలను రక్షణ శాఖ (Pentagon) బేఖాతరు చేయడం వెనుక ఉన్నది కేవలం పంతం కాదు.. యుద్ధభూమిలో ఆ AIకి ఉన్న అనివార్యమైన శక్తి! నిఘా సమాచారాన్ని విశ్లేషించడం, శత్రువుల స్థావరాలను కచ్చితత్వంతో గుర్తించడం వంటి పనుల్లో క్లాడ్ AI ఇప్పుడు అమెరికా సెంట్రల్ కమాండ్‌కు ఒక 'మెదడు'లా మారిపోయింది.

Pentagon Defies Trump Orders US Military Continues Using Claude AI for Key Airstrikes Amid Tech Standoff

నైతిక హద్దులు దాటి ప్రాణనష్టం..

ఈ వివాదానికి బీజం 'నైతికత' అనే ఒక సున్నితమైన అంశం దగ్గర పడింది. తమ AI సాంకేతికతను పెంటగాన్ ఏ రకమైన సైనిక ప్రయోజనాలకైనా, ఎటువంటి ఆంక్షలు లేకుండా వాడుకునేందుకు ఆంత్రోపిక్ సీఈఓ డేరియో అమోడే నిరాకరించారు. "ప్రభుత్వంతో ఉన్న కోట్లాది డాలర్ల ఒప్పందాలు పోయినా పర్వాలేదు కానీ, మా AI మోడల్ ద్వారా నైతిక హద్దులు దాటి ప్రాణనష్టం కలిగించే పనులకు సహకరించలేం" అని ఆయన తేల్చిచెప్పారు.

దీంతో ఆగ్రహించిన ట్రంప్ సర్కారు, ఆంత్రోపిక్‌ను రక్షణ సరఫరా గొలుసుకు 'భద్రతా ముప్పు'గా పరిగణించాలని ఆదేశించింది. కానీ, గత జనవరిలో వెనిజులా అధ్యక్షుడు మదురోను పట్టుకున్న ఆపరేషన్‌లో క్లాడ్ AI చూపిన ప్రతిభను చూసిన పెంటగాన్ అధికారులు, దాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు.

క్లాడ్ AIని తొలగించడం అంత సులభం కాదు

ప్రస్తుతం రక్షణ శాఖ డెవలపర్లు OpenAI (ChatGPT), ఎలాన్ మస్క్‌కు చెందిన xAI (Grok) వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ, వ్యవస్థలో లోతుగా పాతుకుపోయిన క్లాడ్ AIని తొలగించడం అంత సులభం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాలాంటిర్, అమెజాన్ వంటి దిగ్గజాల భాగస్వామ్యంతో అత్యంత రహస్య సైనిక మిషన్ల కోసం ఆమోదం పొందిన ఏకైక AI మోడల్ క్లాడ్ మాత్రమే కావడం గమనార్హం. ఈ సాంకేతిక యుద్ధం ఎటు దారి తీస్తుందో తెలియదు కానీ, భవిష్యత్తులో యుద్ధాలు కేవలం తుపాకులతోనే కాదు.. అత్యంత వేగంగా ఆలోచించగల 'కృత్రిమ మేధ'తో కూడా జరుగుతాయని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+