Seedance 2.0: ఒక్క ప్రాంప్ట్ ఇస్తే చాలు..హాలీవుడ్ రేంజ్ సినిమా విజువల్స్ ఇస్తుంది

గత వారం పది రోజులుగా హాలీవుడ్ నటులు బ్రాడ్ పిట్, టామ్ క్రూజ్ ఫైటింగ్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇంత అద్భుతమైన వీడియోలు ఎలా వచ్చాయి.. ఎవరు చేశారని చాలా మంది తెగ సెర్చ్ చేశారు. ఈ వీడియోలన్నీ చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్ కంపెనీ చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్ ద్వారా రూపొందించబడ్డాయన్న విషయం తెలిసి నోరెళ్లబెట్టారు. భారత్‌లో నిషేధించబడిన TikTok పేరెంట్ కంపెనీ బైట్‌డాన్స్ తాజాగా "Seedance 2.0" అనే కొత్త AI వీడియో జనరేటర్‌ టూల్‌ను విడుదల చేసింది.

రియాలిటీకి దగ్గరగా ఉండే AI వీడియోలను సృష్టించడంలో ఇది కీలక ముందడుగు అని కంపెనీ ప్రకటించింది. విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ టూల్ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.అయితే, కాపీరైట్ సమస్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ హాలీవుడ్‌కు చెందిన మోషన్ పిక్చర్ అసోసియేషన్ నుండి విమర్శలు కూడా ఎదుర్కొంటోంది.

Seedance 2 0 Know All Information About New AI Video Tool Created By Chinese Company Byte Dance

సీడాన్స్ 2.0 ప్రత్యేకత ఏంటంటే..?

వాస్తవంగా,ఈ టూల్ ఇంత పాపులర్ అవటానికి చాలా కారణాలే ఉన్నాయి. ఇది వరకు వచ్చిన AI వీడియో టూల్స్ టెక్స్ట్ ప్రాంప్ట్‌లపై ఆధారపడేవి.సీడాన్స్ 2.0 ప్రత్యేకత ఏంటంటే ఇది టెక్స్ట్, ఫోటోలు, వీడియో క్లిప్‌లు, ఆడియో ఫైల్‌లను కలిపి కళ్లు చెదిరేలా ఉండే అద్భుతమైన వీడియోలు అందిస్తుంది. యూజర్స్ ఎన్ని వీడియోలు, ఫోటోలు రిఫరెన్స్ గా ఇచ్చిన ఈ మోడల్ వాటిని సమగ్రంగా విశ్లేషించి ఒక హైక్వాలిటీ వీడియోను ఇస్తుంది. అందుకే ఈ టూల్ ఒక ప్రాంప్ట్ పై ఆధారపడే జనరేటర్‌లా కాకుండా,డిజిటల్ డైరెక్టర్‌లా వ్యవహరిస్తూ మంచి కంటెంట్ ను క్రియేట్ చేస్తోంది.

సమయాన్ని తగ్గిస్తుంది

గతంలో ఉన్నా, కొన్ని టూల్స్ ద్వారా వీడియోలు అనుకున్నంతా క్లారిటీతో వచ్చేవికావు. సీడాన్స్ 2.0 ఈ సమస్యలకు చెక్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఉదాహరణకు " తండ్రి తన కూతురితో బీచ్ రోడ్ లో నడుస్తున్నాడు" అని ప్రాంప్ట్ ఇస్తే, ఆ విజువల్స్ మాత్రమే చూపించేందుకు AI ప్రయత్నించేది. కానీ, సీడాన్స్ 2.0లో వాతావారణానికి అనుకూలంగా సెట్ చేయడానికి చిన్న డ్యాన్స్ క్లిప్, సౌండ్‌ట్రాక్‌ను అప్‌లోడ్ చేసే అవకాశం ఉంది. ఇది, వీడియోను ఎడిటింగ్ చేసే సమయాన్ని తగ్గించటమే కాకుండా, నిర్మాణ ఖర్చులను కూడా గణనీయంగా తగ్గించే అవకాశాన్ని కల్పిస్తుంది.

సీడాన్స్ 2.0 విడుదలైన వెంటనే, మోషన్ పిక్చర్ అసోసియేషన్ (MPA) దీనిపై తీవ్ర విమర్శలు గుప్పించింది.ఈ మోడల్ తీవ్ర స్థాయిలో కాపీరైట్ ఉల్లంఘనలకు దారితీయవచ్చని ఆ ప్రొడక్షన్ హౌస్ విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ టూల్ విడుదలైన వెంటనే యూజర్స్, వాళ్ళు చేస్తున్నా వీడియోలను పోస్ట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న వారణాసి సినిమాలో కూడా కొన్ని స్టిల్స్ తీసుకొని అభిమానులు వాటిపై వీడియోలు చేస్తూ వైరల్ చేస్తున్నారు..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+