పాలనలో AI వినియోగం..? తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రస్తుతం ఎక్కడచూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) హవా నడుస్తోంది. ఏఐ అన్ని రంగాలనూ ప్రభావితం చేస్తోంది. మానవుడు పరిష్కరించలేని ఎన్నో క్లిష్టమైన సమస్యలకు ఏఐ క్షణాల్లో మార్గం చూపుతోంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగం పెరిగిపోయింది. అన్ని రంగాల్లోకి ఏఐ చొచ్చుకొచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ప్రస్తుతం అన్ని రంగాలను ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో ఏఐను పాలనలో విస్తృతంగా వినియోగించి గవర్నెన్స్ ను సామాన్య ప్రజల వద్దకు చేర్చాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రతి శాఖలో ఏఐ ఛాంపియన్లు, ఏఐ కేటలిస్టుల పేర్లతో ఏఐపై ఆసక్తి, పరిజ్ఞానం ఉన్న సిబ్బందిని ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు వారి వివరాలు పంపాలని ఐటీశాఖ ప్రత్యేక సీఎస్ సంజయ్‌కుమార్ ఇటీవల అన్ని శాఖలకు లేఖలు రాశారు. వీరి ద్వారా ఏఐ వినియోగించి పాలన సాగించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.
అలా ప్రతి శాఖ నుంచి ఎంపిక చేసిన సిబ్బందిని అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ అయిన వాధ్వాని ఫౌండేషన్ తో కలిసి ఏఐ పై శిక్షణ ఇచ్చి ఏఏఐతో పాలన బాధ్యతలను అప్పగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చిన్న చిన్న సంస్థలు ఏఐ(AI)ను ఉపయోగించి మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి. అంతేకాక రానున్న రోజుల్లో ఏఐ వినియోగం మరింతగా పెరగనుంది. ఈ క్రమంలో ఏఐను పాలనలో విస్తృతంగా వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతోంది.

ఇటీవల ఏఐ వినియోగంపై అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులతో మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతోపాటు వివిధ శాఖలకు నేతృత్వం వహిస్తున్న ఐఏఎస్, ఐపీఎస్‌లు హాజరయ్యారు. పాలనలో ఏఐపై విధివిధానాలను చర్చించారు. ఈ మేరకు వీలైనంత త్వరగా ఏఐ వినియోగాన్ని పాలనలో చొప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications