ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బిగ్ షాక్.. పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి

హైదరాబాద్ లోని నేషనల్ పోలీస్ అకాడమీలో మహిళా ఐపీఎస్ ట్రైనీపై లైంగిక వేధింపుల కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయనను రెండు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి ఇస్తూ ఉప్పర్ పల్లి కోర్టు అనుమతించింది. ఈ కేసుకు సంబంధించి ఉదయ్ కృష్ణారెడ్డి నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్న తరుణంలో కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. అందుకు కోర్టు అంగీకరించింది. ఈమేరకు రేపు, ఎల్లుండి ఉదయ్‌ కృష్ణారెడ్డిని పోలీసులు విచారించనున్నారు.

హైదరాబాద్ లోని సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఇటీవల షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకునే అత్యుత్తమ అధికారులు ఇక్కడ ఉంటారు. అయితే ఈ అకాడమీలో ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకుంటున్న ఉదయ్ కృష్ణారెడ్డి తనను లైంగికంగా వేధించాడని, దాడి చేశాడని తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో షాకింగ్ ట్విస్ట్.. ఆయన గదిలో విస్తుపోయేలా
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో షాకింగ్ ట్విస్ట్.. ఆయన గదిలో విస్తుపోయేలా

అయితే ఈ ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని కోర్టులో ప్రవేశపెట్టడంతో జ్యూడిషియల్ కస్టడీ విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. ప్రస్తుతం ఆయన చంచల్ గూడ జైలులో ఉన్నాడు. అయితే ఉదయ్‌ కృష్ణారెడ్డికి చాలా మంది మహిళలతో సంబంధాలు ఉన్నాయని పోలీసుల విచారణలో తేలింది. సోషల్‌ మీడియాలో వారితో చాటింగ్‌ చేయడంతోపాటు.. ప్రపోజ్‌ కూడా చేసినట్టు విచారణలో పోలీసులు గుర్తించారు. అయితే విచారణలో భాగంగా తాను చేసిన తప్పులను ఉదయ్ కృష్ణారెడ్డి సమర్థించుకున్నట్లు తేలింది.

UdayKrishnaReddy big shock trainee IPS officer sexual harassment case court grants police custody

" సివిల్స్ లో విజయం సాధించిన తర్వాత నా గురించి సోషల్ మీడియా, టీవీ ఛానెల్స్ లో కథనాలు వచ్చాయి. వాటిని చూసి చాలా మంది మహిళలు నాకు ప్రొపోజ్ చేశారు. అభిమానులుగా మారారు. వారి ప్రపోజల్స్‌కు నేను ఓకే చెప్పాను. అందులో తప్పేముంది" అని ఉదయ్‌ కృష్ణారెడ్డి చెప్పినట్టు తెలిసింది. ఇక తాజాగా కోర్టు రెండు రోజుల పోలీస్ కస్టడీకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+