ట్రంప్ దెబ్బకు 500 బిలియన్ డాలర్ల బిగ్ ప్రాజెక్ట్ కు మంగళం
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా.. తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చిప్ రీసెర్చ్ ను సరళీకృతం చేసుకోనుంది. కొత్తగా ఇన్‌ఫరెన్స్ చిప్‌ల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కంపెనీ నిర్ణయించింది. డోజో సూపర్ కంప్యూటర్ ప్రాజెక్ట్ ను నిలిపివేసిన అనంతరం టెస్లా.. ఈ నిర్ణయాన్ని తీసుకోవడం చర్చనీయాంశమైంది.
టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ డోజో ప్రాజెక్ట్ ను నిలిపివేసినట్లు అధికారికంగా ప్రకటించారు. ఆ వెంటనే ప్రత్యామ్నాయ వనరులపై దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ క్రమంలో టెస్లా AI5, AI6 చిప్‌ల డెవలప్మెంట్ కు ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు. రెండు రోజుల కిందటే దీనికి సంబంధించిన సమాచారాన్ని తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.

ఈ ప్రకటన వెలువడిన తరువాత టెస్లాలో చోటు చేసుకుంటూ వచ్చిన పరిణామాలపై బ్లూమ్‌బెర్గ్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. డోజో సూపర్ కంప్యూటర్ ప్రాజెక్ట్ ను రద్దు చేయాలని మస్క్ ఆదేశించిన వెంటనే టీమ్ లీడర్ పీటర్ బాన్నన్ కంపెనీ నుండి వైదొలగినట్లు వార్తలొచ్చాయి. దీనిపై టెస్లా ఇంకా స్పందించలేదు.
ఇదే డోజో టీమ్ తో టెస్లా AI5, AI6 నెక్స్ట్ జెన్ చిప్‌ల తయారీపై దృష్టి కేంద్రీకరిస్తుందని మస్క్ పేర్కొన్నారు. ఈ AI5 చిప్‌లు 2026 చివరి నాటికి తయారవుతాయని మస్క్ వెల్లడించారు. సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ నుండి AI6 చిప్‌లను కొనుగోలు చేయడానికి 16.5 బిలియన్ల ఒప్పందాన్ని ప్రకటించారు మస్క్.
సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలు, ఆప్టిమస్ హ్యూమనాయిడ్ రోబోలలో భవిష్యత్ AI ఇన్‌ఫరెన్స్ చిప్‌లు, AI6 సహా, విస్తృతంగా ఉపయోగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల నుండి భారీ మొత్తంలో డేటా, వీడియోను ప్రాసెస్ చేయడానికి, ఆటోమేకర్ సెల్ఫ్-డ్రైవింగ్ సాఫ్ట్‌వేర్‌పై శిక్షణ ఇవ్వడానికి డోజో సూపర్ కంప్యూటర్‌ను రూపొందించింది టెస్లా.
ఇది ప్రతికూల ఫలితాలను ఇచ్చింది. రెండు విభిన్న AI చిప్ డిజైన్‌ల కోసం అందుబాటులో ఉన్న టెస్లా వనరులను విభజించాల్సి వస్తోందని, అది సరికాదని మస్క్ వ్యాఖ్యానించారు. ఎలాన్ మస్క్ చేసిన ఈ వ్యాఖ్యలు డోజో ప్రాజెక్ట్ భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తింది. మోర్గాన్ స్టాన్లీ ఎనలిస్ట్ ఆడమ్ జోనాస్ నేతృత్వంలోని అనలిటిక్ టీమ్ డోజో సూపర్ కంప్యూటర్‌ను 500 బిలియన్లుగా 2023లోనే అంచనా వేసింది.
గత సంవత్సరం అమెరికాలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు దీనికి బ్రేకులు వేశాయి. ఆ దేశ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఎలాన్ మస్క్ ప్రత్యక్షంగా పాలుపంచుకోవడం, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మద్దతు ప్రకటించడం.. అదే సమయంలో పెరిగిన పోటీ కారణంగా టెస్లా కార్లఅమ్మకాలు తగ్గడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. కంపెనీ షేర్ ధర సైతం పడిపోయింది.
మస్క్ రాజకీయ జోక్యం వల్ల యూరోపియన్ వినియోగదారులు టెస్లా కార్ల కొనుగోళ్లపై పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేపట్టింది టెస్లా. పునర్నిర్మాణ ప్రక్రియను మొదలుపెట్టింది. ఎగ్జిక్యూటివ్‌లు సంస్థకు గుడ్ బై చెప్పారు. వందల సంఖ్యలో ఉద్యోగాల కోత పెట్టాల్సి వచ్చింది.
-
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications