AI Tools: రీల్స్ కోసం ఉచిత ఏఐ టూల్స్ ఇవే..
Best AI Tools for Reels: ఇప్పుడు వీడియోలను రూపొందించడానికి మీకు కెమెరా, మైక్ లేదా ఎడిటర్ అవసరం లేదు. ఉచిత ఏఐ టూల్స్‌తో మీరు కేవలం టెక్స్ట్‌ను ఇన్‌పుట్‌గా ఇచ్చి నిమిషాల్లో వైరల్ రీల్స్‌ను సృష్టించవచ్చు. ఈ ఏఐ టూల్స్ మీ కంటెంట్‌ను సోషల్ మీడియా సూపర్ స్టార్‌గా మార్చగలవు. మీరు సోషల్ మీడియాలో స్టార్ అవ్వాలంటే ఏఐ టూల్స్ మిమ్మల్ని సూపర్ స్టార్‌గా మార్చగలవు. దీని కోసం కెమెరా, ఎడిటింగ్ స్కిల్స్, ఎక్కువ సమయం అవసరం లేదు. ఈ ఏఐ టూల్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే కేవలం టెక్స్ట్‌ను ఇన్‌పుట్ చేయడం ద్వారానే వీడియోలను సృష్టిస్తాయి. అది కూడా అద్భుతమైన నాణ్యతతో వీడియోలను అందిస్తాయి. ఈ క్రమంలోనే వీడియోలు వైరల్ అయ్యే అవకాశం ఉంది. మీరు చేయాల్సిందల్లా చిన్న స్క్రిప్ట్‌ను సిద్ధం చేయాలి. అది చిట్కాలు, కథ, కోట్స్, వార్తలు కావచ్చు. మిగిలినదంతా ఏఐ స్వయంగా చూసుకుంటుంది. ఈ క్రమంలో 3 ఉచిత ఏఐ వీడియో టూల్స్ గురించి తెలుసుకుందాం. ఈ టూల్స్ మీరు రాసిన స్క్రిప్ట్‌ను కొన్ని సెకన్లలో ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ లేదా ఫేస్బుక్ వీడియోలుగా మార్చగలవు.
ఈ ఏఐ టూల్స్ ఏం చేస్తాయంటే?
*ఇవి నేపథ్య విజువల్స్‌ను ఎంచుకుంటాయి.
*ఇవి సంగీతాన్ని జోడిస్తాయి.
*ఇవి టెక్స్ట్‌ను వాయిస్‌ఓవర్‌గా మారుస్తాయి.
*ఇవి ట్రాన్సిషన్లు, సబ్‌టైటిళ్లను కూడా వర్తింపజేస్తాయి.
*ఇవన్నీ నిమిషాల్లోనే చేసి అద్భుతమైన వీడియోను సృష్టిస్తాయి.

టెక్స్ట్‌ను వీడియోగా మార్చే టాప్ ఉచిన ఏఐ టూల్స్ ఇవే..
Kaiber.AI:
నేడు అనేక ఏఐ టూల్స్ టెక్స్ట్‌ను వీడియోగా మార్చే పనిని చేస్తాయి. అయితే మూడు ఏఐ టూల్స్ అత్యంత ప్రజాదరణ పొందాయి. వీటిలో మొదటిది Kaiber.AI. ఇది టెక్స్ట్‌ను యానిమేటెడ్, సినిమాటిక్ వీడియోలుగా మారుస్తుంది. విజువల్ స్టోరీటెల్లింగ్(Visual Storytelling) కోసం కూడా ఇది అద్భుతంగా పని చేస్తుంది.
InVideo AI:(ఉచిత ప్లాన్)
ఇక్కడ మీరు టెక్స్ట్-టు-వీడియో టెంప్లేట్లను ఉపయోగించి వార్తలు, ఆరోగ్యం చిట్కాలు మొదలైన కంటెంట్‌ను అద్భుతమైన వీడియోలుగా మార్చవచ్చు.
CapCut AI Editor:
ఈ టూల్ మొబైల్-ఫ్రెండ్లీ, ఇన్‌స్టాగ్రామ్ కోసం ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇందులో ఆటో కట్, జూమ్, సబ్‌టైటిల్స్ వంటి అనేక వైరల్ రీల్ ఎస్సెన్షియల్స్ ఉంటాయి.
కంటెంట్ క్రియేటర్లకు ఇవి గేమ్ చేంజర్?
ఈ రోజుల్లో ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో రీల్స్, షార్ట్స్ అత్యంత వేగంగా వైరల్ అయ్యే కంటెంట్. ఈ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రేక్షకులకు మంచి కంటెంట్ మాత్రమే కాదు.. వేగంగా, ప్రభావవంతంగా ఉండే కంటెంట్ కూడా కావాలి. ఏఐ టూల్స్ ఈ పనిని సులభతరం చేస్తాయి. వీటితో మీరు ఎలాంటి ఎడిటర్ సహాయం లేకుండా, అన్నింటికంటే ముఖ్యంగా ఏదైనా విషయంపై రోజువారీ కంటెంట్‌ను సృష్టించవచ్చు. మీరు కేవలం టెక్స్ట్‌ను అందించాలి. వీడియో త్వరగా సిద్ధంగా ఉంటుంది.
రీల్స్ వైరల్ అయ్యే అవకాశాలు ఎక్కువ?
ఏఐ టూల్స్ ద్వారా ఉత్పత్తి చేయబడిన రీల్స్ టెంప్లేట్ ఆధారితమైనవి. అంటే వాటిలో అధిక ఎంగేజ్మెంట్ అంశాలు ఉంటాయి. వీటిలో జూన్ ఇన్/ఔట్ , ఆటో సబ్‌టైటిల్స్, హై కాంట్రాస్ట్ బ్యాక్‌గ్రౌండ్స్, డ్రామాటిక్ మ్యూజిక్ ఉంటాయి. ఇవి వీక్షకులను ఆకర్షించి వీడియోను చివరి వరకు చూసే అవకాశాన్ని పెంచుతాయి. ఏదైనా రీల్ లేదా షార్ట్ వైరల్ అవ్వడానికి ఇవి అవసరం.












Click it and Unblock the Notifications