ఫుడ్ డెలివరీలో ఫ్రెండ్లీ ఆప్షన్లు- ఒక్క క్లిక్ తో..

Uber Eats: ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ రంగంలోకి కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎంటర్ అయింది. ఉబెర్ ఈట్స్ ఈ టూల్స్ ను అడాప్ట్ చేసుకుంది. ఫుడ్ ఆర్డర్, డెలివరీ ప్రక్రియను మరింత సులభతరం, వేగవంతం చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో కూడిన కేటగిరీలను అందుబాటులోకి తెస్తోంది.

మెనూ, ఫుడ్ ఫొటోలు, కస్టమర్లు ఇచ్చే రివ్యూలు, ఆర్డర్ల కోసం లైవ్ చాటింగ్, ఫుడ్ ఫొటోలను షేర్ చేసినందుకు కస్టమర్లకు రివార్డ్ పాయింట్లు, కూపన్ల వంటివి ఇవ్వడానికి ఈ సరికొత్త ఏఐ టూల్స్ ఇందులో ఉన్నాయి. ఈ అప్‌గ్రేడ్‌ వర్షన్ యాప్ ప్రస్తుతం అందుబాటులో ఉందని ఉబేర్ ఈట్స్ వెల్లడించింది.

Uber Eats offers AI-based menu and food photos to its customers

మెనూల్లో ఇప్పుడు AI సహాయంతో రాసిన డిస్క్రిప్షన్స్ అందుబాటులో ఉన్నాయని ఉబేర్ ఈట్స్ తెలిపింది. ఫుడ్ ఐటమ్స్ కోసం ఆర్డర్ చేసే ముందు.. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ ఏఐ బేస్డ్ మెనూలో చూడొచ్చు. న్యూట్రీషన్ వేల్యూస్ ను కూడా ఇందులో పొందుపర్చినట్లు చెబుతున్నారు.

ఫుడ్ డెలివరీ తీసుకున్న తరువాత సంబంధిత ఫొటోలను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డిజైన్ చేసే ఆప్షన్.. యూజర్లకు అందుబాటులో ఉంటుందీ యాప్ లో. దీన్ని షేర్ చేస్తే ఆ వినియోగదారుడికి క్రెడిట్స్ లభిస్తాయి. పాయింట్స్ ను అకౌంట్ లో జమ చేస్తుంది ఉబేర్ ఈట్స్ యాజమాన్యం.

అమెరికా, యూకే, కెనడా, మెక్సికో వంటి దేశాల వినియోగదారులు కూడా తమ ఫుడ్ ఆర్డర్ల ఫొటోలను రివ్యూలతో పాటు అప్‌లోడ్ చేయవచ్చు. దీనితో పాటు కొత్తగా ప్రవేశపెట్టిన లైవ్ ఛాట్ ఫీచర్ ద్వారా రెస్టారెంట్ల రివ్యూలు, తమకు ఇష్టమైన ఫుడ్ దొరుకుతుందా? లేదా? అనేది కూడా నిర్ధారించుకోవచ్చు.

దీనివల్ల ఆర్డర్లలో తప్పులు, పొరపాట్లు జరిగే అవకాశాలు తగ్గుతాయని ఉబేర్ ఈట్స్ యాజమాన్యం అంచనా వేస్తోంది. కస్టమర్ల నుంచి ఖచ్చితత్వంతో కూడిన ఫీడ్ బ్యాక్ లభిస్తుందని భావిస్తోంది. ఆర్డరింగ్, ఫుడ్ డెలివరీ ప్రక్రియను రియల్ టైమ్ ఆధారంగా పర్యవేక్షించడానికీ ఉపయోగపడుతుందని చెబుతోంది.

తమ కస్టమర్లకు AI బేస్డ్ రియల్-టైమ్ కమ్యూనికేషన్, కమ్యూనిటీ-బేస్డ్ కంటెంట్‌తో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకుని రావడం వల్ల పోటీతత్వం కూడా పెరుగుతుందని, ఫలితంగా వినియోగదారులకు మరింత నాణ్యమైన సేవలు అందుతాయని చెబుతోంది. వారి అభిప్రాయాలను అనలైజ్ చేయడానికి, అభిరుచులకు అనుగుణంగా ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేయడానికి ఏఐ టూల్స్ ఫీడ్ బ్యాక్ ఇస్తాయని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+