డీప్ ఫేక్ వీడియోను క్షణాల్లో గుర్తించే 'ఏఐ'.. సైబర్ నేరాలకు చెక్..!
మనం సామాజిక మాధ్యమాల్లో చాలా వీడియోలు చూస్తుంటాం. అయితే అందులో ఏవి రియల్.. ఏవి అబద్ధం అని తెలుసుకోవడం చాలా కష్టంగా మారింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో మార్ఫింగ్ వీడియోలు అత్యధికంగా పెరిగిపోయాయి. అటు సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల వీడియోలను డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
మరికొంత మంది సైబర్ నేరగాళ్లు ఈ మార్ఫింగ్ వీడియోల ద్వారా మోసాలు సృష్టించడం, రెండు గ్రూప్స్ మధ్య విద్వేషాలు రగిలించడం చేస్తున్నారు. ఇలాంటి వీడియోలను నమ్మొద్దని ఇప్పటికే ప్రభుత్వాలు, అధికారులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినా చాలా మంది సైబర్ నేరగాళ్ల వలలో పడి మోసపోతున్నారు.
ఈ క్రమంలో డీప్ ఫేక్ చిత్రాలను గుర్తించేందుకు యూసీ రివర్‌సైడ్ అనే సంస్థ పరిశోధకులు, గూగుల్ సంయుక్తంగా UNITE(యూనివర్సల్ నెట్ వర్క్ ఫర్ ఐడెంటిఫైయింగ్ ట్యాంపర్డ్ అండ్ సింథటిక్ వీడియోస్) అనే కొత్త AI టూల్ ను అభివృద్ధి చేశాయి. ఇది ముఖాలు కనిపించకపోయినా, కృత్రిమంగా సృష్టించిన లేదా మార్ఫింగ్ వీడియోలను గుర్తించగలదు.

ఫేక్ ప్రచారాలను అరికట్టడంలో, ప్రజల నమ్మకాన్ని కాపాడటంలో ఇది ఒక కీలకమైన ముందడుగుగా భావించవచ్చు. ఇది పాత మోడల్స్ మాదిరిగా ఫేషియల్ ఎక్స్ ప్రెషన్స్ పై ఆధారపడకుండా డీప్ ఫేక్ వీడియోలను క్షణాల్లో గుర్తిస్తుంది. ప్రస్తుతం డిజిటల్ మోసాలు, సైబర్ నేరాలు పెరిగిపోతున్న క్రమంలో ఇలాంటి వాటిని అరికట్టడానికి UNITE వంటి వ్యవస్థలు చాలా అవసరం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications