బిగ్ స్క్రీన్ పైనా Youtube చూసే ఛాన్స్

మీ ఇంట్లో స్మార్ట్ టీవీ ఉందా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే. మీరు యూట్యూబ్ లో వీడియోస్ చూస్తున్నపుడు కొన్ని సందేహాలు రావొచ్చు ఆ వీడియోలో ఉన్నది ఎవరు అతను ఇంతకుముందు ఎలాంటి వీడియోస్ చేసేవాడు, అతను పేరేంటి, ఊరేంటి అని. ఆ డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి మనం గూగుల్ కి వెళ్లి మనకి కావాల్సిన సమాచారాన్ని అడిగి తెలుసుకుంటాం. ఇప్పుడలా కాదు, యూట్యూబ్ లోనే ఒక కొత్త ఏఐ టూల్ తో మనకి కావాల్సిన విషయాలు తెలుసుకోవచ్చు.

వివరాల్లోకి వెళ్తే, టీవీలో యూట్యూబ్ చూసేవారు ఇప్పుడు నేరుగా వాళ్ళకి ఆ వీడియో కోసం మరింత సమాచారం కావాలంటే ఆస్క్ (ASK) బటన్ క్లిక్ చేసి AI అసిస్టెంట్ ద్వారా తెలుసుకోవచ్చు..ఇప్పటివరకు ఈ ఫీచర్ మొబైల్ ఫోన్లలో, వెబ్సైట్ లకు మాత్రమే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు బిగ్ స్క్రీన్ లో కూడా ఈ ఆప్షన్ చూడవచ్చని కంపెనీ సపోర్ట్ పేజీ ద్వారా తెలిపింది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఇంగ్లీష్, హిందీ, స్పానిష్, పోర్చుగీస్ , కొరియన్ భాషలో మాత్రమే ఉంది.

YouTube Takes Its Conversational AI Experiment to the Big Screen Know How It Works

నిజానికి యూట్యూబ్ ఈ ఫీచర్ ను 2024లోనే లాంచ్ చేసింది. అయితే ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేని విధంగా అధిక శాతం అమెరికన్లు టీవీ ద్వారా యూట్యూబ్ ను చూడడం మొదలుపెట్టారని అందుకనే ఈ ఆప్షన్ బిగ్ స్క్రీన్ లో కూడా అందుబాటులోకి వచ్చింది. నీల్సెన్ రిపోర్ట్ ప్రకారం ఏప్రిల్ 2025 నుండి చూస్తే యూట్యూబ్ కు 12.4% మంది టీవీ ద్వారా వీక్షించారు. ఇంకా చెప్పాలంటే దిగ్గజాలైన డిస్నీ, Netflix ను కూడా వెనక్కు నెట్టిందని చెప్పవచ్చు.

ఇతర కంపెనీలు కూడా ఇలాంటి ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నాయి. అమెజాన్ తన Fire TV పరికరాల్లో Alexaను ప్రవేశపెట్టింది. Roku తన AI వాయిస్ అసిస్టెంట్‌ను మరింత మెరుగుపరిచింది. దీనివల్ల యూజర్స్ కు ఎలాంటి సందేహాలున్నా అడగవచ్చు . ఉదాహరణకు: ఈ సినిమా కథ ఏమిటి?, ఇది ఎంత భయంకరంగా ఉంటుంది? వంటి అనేక ప్రశ్నలు అడగొచ్చు. Netflix కూడా ఇలాంటి ఆప్షన్ ను తీసుకురావటానికి ప్రయత్నిస్తుంది

మరో విధంగా కూడా యూట్యూబ్ టీవీలో చూసే ఎక్స్పీరియన్స్ ను మెరుగుపరిచిందని చెప్పవొచ్చు. చిన్న రెసొల్యూషన్ తో ఉన్న వీడియోలు అప్లోడ్ చేసిన కూడా వాటిని హెడ్ వీడియోస్ గా మారుస్తూ యూజర్స్ కు మంచి అనుభూతిని ఇస్తుందని చెప్పవచ్చు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+