ఇక బ్యాంక్ అకౌంట్లకూ ‘పోర్టబులిటీ’.. సేవలు నచ్చకపోతే బ్యాంకును మార్చేయడమే!

బ్యాంకు ఖాతాదారులకు ఓ సరికొత్త సదుపాయం త్వరలోనే అందుబాటులోనికి రానుంది. అదే.. అకౌంట్ నంబర్ పోర్టబులిటీ. ఇన్నాళ్లూ మొబైల్ నంబర్లకే పరిమితమైన ఈ పోర్టబులిటీ సదుపాయం ఇప్పుడు బ్యాంకు అకౌంట్ నంబర్లకు కూడా

ముంబై: బ్యాంకు ఖాతాదారులకు ఓ సరికొత్త సదుపాయం త్వరలోనే అందుబాటులోనికి రానుంది. అదే.. అకౌంట్ నంబర్ పోర్టబులిటీ. ఇన్నాళ్లూ మొబైల్ నంబర్లకే పరిమితమైన ఈ పోర్టబులిటీ సదుపాయం ఇప్పుడు బ్యాంకు అకౌంట్ నంబర్లకు కూడా విస్తరించనుంది.

మొబైల్ సేవలు నచ్చకపోతే సర్వీస్ ప్రొవైడర్ ను ఎలాగైతే మనం మార్చేసుకుంటున్నామో అలాగే బ్యాంకు సేవలు నచ్చకపోయినా మరో బ్యాంకుకు మారిపోవచ్చు. క్రెడిట్, డెబిట్ లాంటి ఎలాంటి లావాదేవీ సౌకర్యాలు కోల్పోకుండా, అదే అకౌంట్ నంబర్ తో మరో బ్యాంకుకు కస్టమర్లు మారేలా వెసులుబాటు కల్పించనున్నట్టు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా పేర్కొంది.

rbi

ఆధార్ నమోదు, టెక్నాలజీ పురోగతి పెరుగుతుండటంతో, బ్యాంకులు, వాటాదారులు బ్యాంకు అకౌంట్ నంబర్ పోర్టబులిటీ సదుపాయం సాకారానికి సన్నద్దమవ్వాలని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా మంగళవారం ఆదేశించింది. ఒక బ్యాంకు కస్టమర్, మరో బ్యాంకుకు మారినప్పుడు ఆ కస్టమర్ అదే అకౌంట్ నంబర్ వాడుకునేలా బ్యాంకు అకౌంట్ నంబర్ పోర్టబులిటీ అవకాశం కల్పిస్తోంది.

భారతీయ బ్యాంకింగ్ సిస్టమ్ లో రెండు కీలక అంశాలు దీనికి సహకరించనున్నాయి. ఒకటి - కస్టమర్లకు యూనిక్ ఐడెంటిఫికేషన్, రెండు - సెంట్రల్ పేమెంట్ సిస్టమ్ గా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) ఉండటం.

గత రెండేళ్లుగా అకౌంట్ నంబర్ పోర్టబులిటీని అమల్లోకి తేవాలని యోచిస్తున్నామని, ఆధార్ నమోదు, ఎన్పీసీఐ, వెనువెంటనే పేమెంట్ సిస్టమ్ గా ఎక్కువ యాప్స్ అందుబాటులోకి వస్తుండటం, బ్యాంకు అకౌంట్ నంబర్ పోర్టబులిటీకి దోహదం చేస్తున్నాయని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా చెప్పారు.

ప్రస్తుతం స్పెసిఫిక్ బ్యాంకు అకౌంట్ ను గుర్తించాలంటే ఐఎఫ్ఎస్సీ కోడ్, బ్యాంకు అకౌంట్ నంబర్, మొబైల్ మనీ ఐడెంటిఫైయర్ నంబర్, కస్టమర్ రిలేషన్ షిప్ నంబర్ వంటి ఎన్నో నంబర్లు అవసరం. కానీ యూనిక్ ఐడెండిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఎన్ పీసీఐతో ఆధార్ పేమెంట్స్ బ్రిడ్జ్ సిస్టమ్ ను అభివృద్ధి చేయడంతో ఇక స్పెసిఫిక్ బ్యాంకు అకౌంట్ ను క్షణాల్లో గుర్తించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+