నాకు నాన్న ఉన్నా లేనట్టే.. ఆ పరిస్థితి ఎవరికీ రాకూడదు - టాలీవుడ్ యాంకర్

సౌమ్య రావు.. బుల్లితెర ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కర్ణాటకలోని షిమోగాలో జన్మించిన ఈమె.. 2018లో టెలివిజన్ రంగంలో తమిళ సీరియల్స్ ద్వారా కెరీర్ ప్రారంభించింది. రోజా సీరియల్ తో ప్రేక్షకుల్లో బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ క్రేజ్ తోనే తెలుగులో కూడా 'శ్రీమంతుడు' సీరియల్ లో నటించి మెప్పించింది. అయితే ఈ భామకు బ్రేక్ మాత్రం జబర్థస్త్ షో ద్వారానే దక్కిందని చెప్పాలి. జబర్దస్త్‌లో తక్కువ కాలమే యాంకర్ గా పని చేసినా.. మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది.

అయితే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సౌమ్యరావు తన జీవితంలోని కష్టాలను పంచుకున్నారు. తల్లి అనారోగ్యం, ఆమె పడిన వేదన తనను తీవ్రంగా కలచివేశాయని పేర్కొన్నారు. కుమార్తెగా తల్లిని అంతటి క్లిష్ట పరిస్థితుల్లో చూడడం అత్యంత బాధాకరమని భావోద్వేగంగా తెలిపారు. కష్టకాలంలో తల్లిదండ్రులను చూసుకోవడమే నిజమైన ప్రేమకు సూచిక అని అభిప్రాయపడ్డారు. తల్లి ఆరోగ్యం క్షీణించగా, షూటింగ్ నిమిత్తం సౌమ్య హోమ్ నర్సును నియమించారు. కానీ ఆ నర్సు మోసానికి పాల్పడిందని వాపోయారు.

anchor-soumya-rao-shocking-comments-about-her-father-and-film-industry-goes-viral

తల్లికి ఫుడ్‌పైప్ ద్వారా అందించాల్సిన ఆహారం కోసం డబ్బులు కాజేసి, ₹700 విలువైన నాలుగు రోజుల ఆహారాన్ని కూడా ఇవ్వలేదు. 15 రోజులు తల్లికి సరైన ఆహారం అందలేదని, నర్సు డబ్బులు తీసుకుందని మెడికల్ షాప్ ద్వారా తెలియగానే సౌమ్య తీవ్రంగా కలత చెందారు. "బెడ్‌పై ఉండి, మాట్లాడలేని వారి ఆహారాన్ని కూడా దొంగిలించే దౌర్భాగ్యులు సమాజంలో ఉన్నారని" ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన తనను మానసికంగా బాగా కుంగదీసిందని, "15 రోజులు ఎలా వదిలేసి వెళ్ళిపోయాను, ఇది కూడా చూసుకోలేకపోతున్నానా?" అని బాధపడ్డానని సౌమ్య వివరించారు.

ఇక తండ్రి గురించి ప్రస్తావిస్తూ, ఆయన ఉన్నా లేనట్టేనని సౌమ్య తెలిపారు. ఆయనకు చెడు అలవాట్లు, ముఖ్యంగా మద్యపాన వ్యసనం ఉండేవని వివరించారు. కుటుంబం పట్ల ఎలాంటి బాధ్యత లేదని, తన వివాహం, విద్య, సంరక్షణ విషయంలో శ్రద్ధ చూపలేదని ఆమె ఆవేదన చెందారు. కనీసం ప్రేమ, ఆప్యాయతను కూడా అందించలేదని పేర్కొన్నారు.

ప్రస్తుతం తన తండ్రి బెంగళూరుకు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో నివసిస్తున్నారని తెలిపింది. మూడు, నాలుగు నెలలకోసారి కలుస్తుంటారని, కలిసినప్పుడు కూడా డబ్బుల కోసమే వస్తారని సౌమ్య చెప్పుకొచ్చింది. తనకు తోబుట్టువులు లేరని, జీవితంలో ఒక్కదాన్నే పోరాడుతున్నానని సౌమ్య వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+