మరో సస్పెన్స్ థ్రిల్లర్‌తో యంగ్ హీరో.. హ్యాట్రిక్ హిట్ కొట్టేనా !!

తెలుగు సినీ పరిశ్రమకు 'అందాల రాక్షసి' సినిమాతో ఎంట్రీ ఇచ్చారు "నవీన్ చంద్ర". ఆరంభం నుంచే వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ టాలెంటెడ్ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. కొంతకాలం నుంచి మంచి సినిమాలే చేస్తున్నప్పటికీ సరైన రీతిలో హిట్ పడలేదు. ఇటీవల 'షో టైమ్', '28 డిగ్రీల సెల్సియస్', 'లెవన్' వంటి చిత్రాలతో ప్రేక్షకులను పలకరించిన ఆయన.. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తోన్న నవీన్ ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్టులను ప్రకటిస్తున్నాడు.

కేవలం హీరోగానే కాకుండా విభిన్న పాత్రలతో సైతం ఆడియన్స్ ని అలరిస్తున్నారు ఈ యంగ్ హీరో. ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత, బాలకృష్ణ వీర సింహారెడ్డి చిత్రాల్లో ముఖ్య పాత్రలు చేసి మెప్పించారు. రీసెంట్ గానే రవితేజ నటించిన మాస్ జాతర చిత్రంలో కూడా అదరగొట్టారు. అంతే కాకుండా తెలుగులోనే కాకుండా ఇటీవలే కన్నడ ఇండస్ట్రీలోనూ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. కిచ్చా సుదీప్ హీరోగా వచ్చిన మార్క్ చిత్రంలో కనిపించారు.

actor-naveen-chandra-honey-movie-glimpse-released

ఇప్పుడు 'షో టైమ్', 'లెవన్' వంటి మూవీస్ తో మంచి హిట్స్ అందుకున్న ఈ యంగ్ హీరో.. హారర్, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రాలతో రాణిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా నిజ జీవిత సంఘటనల ఆధారంగా మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు, డార్క్ సైకలాజికల్ ఎలిమెంట్స్‌తో కూడిన సినిమాతో ప్రేక్షకులను భయపెట్టేందుకు రెడీ అవుతున్నారు. నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం "హనీ". ఈ సైకలాజికల్ హారర్ మూవీకి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. ఓవా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో దివి, రాజా రవీంద్ర, బేబీ జయన్ని, బేబీ జయత్రి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి అజయ్ అరసాడ సంగీతం అందిస్తున్నారు. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ షురూ చేసింది మూవీ యూనిట్. న్యూ ఇయర్ సందర్భంగా హనీ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.

కాగా 'పలాస 1978', 'శ్రీదేవి సోడా సెంటర్' వంటి చిత్రాలతో తనకంటూ ఒక మార్కును క్రియేట్ చేసుకున్న కరుణ కుమార్.. ఈసారి కొత్త కాన్సెప్ట్ తో ఆడియన్స్ ని అలరిస్తారో లేదో చూడాలి. అంతే కాకుండా వరుసగా రెండు హిట్స్ అందుకున్న నవీన్ కూడా హ్యాట్రిక్ కొట్టాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+