ఇక యుద్ధమే.. నటుడు శివాజీకి దిమ్మతిరిగే కౌంటర్స్ ఇచ్చిన అనసూయ, చిన్మయి !!
టాలీవుడ్ నటుడు శివాజీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి.. హీరోగా మారి ప్రేక్షకులను అలరించారు. అయితే రాజకీయలు, తన పర్సనల్ కారణాల కారణంగా కొన్నేళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. రీసెంట్ గానే 'కోర్టు' సినిమాతో అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రంలో ఆయన పోషించిన మంగపతి పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. దీంతో మళ్లీ వరుస అవకాశాలతో బిజీ అవుతున్నారు.
కానీ ఇప్పుడు అనూహ్యంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద వివాదానికి తెరలేపాయి. కాగా శివాజీ నటిస్తున్న తాజా చిత్రం 'దండోరా' ఈ నెల 25న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నేటితరం హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యల వ్యవహారం సినీ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో సైతం హాట్ టాపిక్ గా నడుస్తుంది.

ఆయన ఏమన్నారంటే..
హీరోయిన్లు పబ్లిక్ ఈవెంట్లకు వచ్చేటప్పుడు పద్ధతిగా ఉండాలని.. చీరలు కట్టుకుని వస్తే మరింత అందంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. గ్లామర్ ఒక స్థాయి వరకు బాగుంటుందని కానీ హద్దులు దాటితే గౌరవం తగ్గుతుందని వ్యాఖ్యానించారు. పాతతరం నటీమణులు సావిత్రి, సౌందర్యలు ఎప్పుడూ పద్ధతిగా ఉంటూనే నటనతో ప్రేక్షకులను మెప్పించారని చెప్పారు. నేటితరం హీరోయిన్లు కూడా అందాల ప్రదర్శనకంటే నటనకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఉపయోగించిన కొన్ని పదాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతోంది.
మరీ ముఖ్యంగా 'సామాన్లు' అనే పదాన్ని ఉపయోగించడం.. మోడ్రన్ డ్రెస్ లను ధరించే కొందరు అమ్మాయిలను "దరిద్రపు ***" ఇలాంటి బట్టలు వేసుకున్నావు ఏంటి ? అంటూ కొందరు కామెంట్స్ చేస్తారని చెప్పారు. ఈ రెండు విషయాలపైనే ఆయనకు వ్యతిరేకంగా కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో రెండు వర్గాలుగా చర్చ సాగుతోంది. ఒక వర్గం మాత్రం శివాజీకి సపోర్ట్ చేస్తుంటే.. మరో వర్గం మాత్రం ఇది మహిళలను కించపరిచారని మండిపడుతున్నారు.
ఈ వివాదం మరింత ముదిరేందుకు కారణంగా సింగర్ చిన్మయి శ్రీపాద, యాంకర్ అనసూయ నిలుస్తున్నారు. వీరిద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు అంశాలపై రియాక్ట్ అవుతూ ఉంటారు. స్త్రీ ల విషయంలో, మరీ ముఖ్యంగా బట్టల విషయంలో ఆడవారికి అండగా నిలుస్తుంటారని తెలిసిందే. కాగా శివాజీ చేసిన వ్యాఖ్యలపై ఆమె సోషల్ మీడియా వేదికగా చిన్మయి తీవ్రంగా మండిపడ్డారు.
మీరు మాత్రం అలా..
హీరోయిన్ల డ్రెస్సింగ్ గురించి మాట్లాడే హక్కు ఆయనకు ఉందా? అంటూ ప్రశ్నించారు. "మీరు మాత్రం జీన్స్, హూడీలు వేసుకుంటారు, కానీ హీరోయిన్లు మాత్రం పద్ధతిగా ఉండాలా? నిజంగా సంస్కృతి మీద అంత ప్రేమ ఉంటే మీరు కూడా సంప్రదాయ దుస్తులు ధరించండి" అంటూ ఘాటు కౌంటర్ ఇచ్చారు. షూటింగ్ సెట్స్‌లో మహిళలను ఇలాగే గౌరవిస్తారా? అని ఆమె ప్రశ్నించడం ఈ వివాదాన్ని మరింత హాట్ టాపిక్‌గా మార్చింది.
Telugu Actor Sivaji doles out unnecessary advice to Actresses using slurs like ‘Daridrapu Munda’ saying they need to wear Saris to cover their ‘Saamaan’ - a word incels use.
— Chinmayi Sripaada (@Chinmayi) December 23, 2025
Actor Shivaji played a villain in a fantastic film and end up becoming the hero for incel boys.
The…
అలానే యాంకర్, నటి అనసూయ కూడా పరోక్షంగా ఈ విషయంపై రియాక్ట్ అయ్యారు. "ఇది మా బాడీ... మా ఇష్టం" అనే పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. నెటిజన్లు ఈ పోస్ట్‌ను శివాజీకి కౌంటర్‌గా భావిస్తూ అనసూయకు మద్దతు తెలుపుతున్నారు. అంతే కాకుండా పలువురు ప్రముఖులు కూడా శివాజీ వ్యాఖ్యలను తప్పుబడుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
— Anasuya Bharadwaj (@anusuyakhasba) December 23, 2025
మొత్తానికి '90స్' వెబ్ సిరీస్, 'కోర్టు' సినిమాలతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన శివాజీ.. ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అయితే అదే సమయంలో వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. చెప్పే ఉద్దేశం బాగానే ఉన్నా.. చెప్పిన వేదిక, చెప్పిన విధానం అనే అంశాలపై చర్చ నడుస్తోంది. ఇక ఈ వివాదంపై శివాజీ మళ్లీ స్పష్టత ఇస్తారా? లేదా క్షమాపణ చెబుతారా? అన్నది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications